శనివారం ఏపీలోని పలు జిల్లాలో పంచాయితీ ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అలానే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ వైఎస్సార్ సీపీ బలపరిచన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 254 వార్డుమెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతగా జరిగాయి. అయితే ఈ ఎన్నికల వేళ ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లకి పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదంటూ స్థానిక డీఎస్పీ హెచ్చరించారు.
ఏపీలోని పలు జిల్లాలో పంచాయితీ ఉపఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే ఏలురూ జిల్లాలో కూడా పలు పోలింగ్ జరిగింది. ఈక్రమంలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు పోలింగ్ కేంద్రాలక వద్దకు వెళ్తున్నారు. అక్కడ ఓటింగ్ సరళని, ఇతర విషయాలను పరిశీలిస్తున్నారు. అలానే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు.. తన కారులో బయలు దేరాడు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో చింతమనేని స్థానిక డీఎస్పీ అడగించారు. రౌడీ షీటర్లకు అనుమతి లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చింతమనేని హెచ్చరించారు.
అయితే తనపై రౌడీషీటర్ కేసు ఉంది నిజమైనని, కానీ తాను పోలింగ్ కేంద్రంకి వెళ్లి.. ఏమైనా అల్లరు సృష్టిస్తానా? అని పోలీసులను ప్రశ్నించాడు. అలా అయితే బైండోవర్ చేయకూడదండా? అంటూ డీఎస్పీతో వాగ్వాదంపెట్టుకున్నాడు. ఏం చేయాలో తమకు తెలుసని..మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ డీఎస్పీ కూడా సమాధానం ఇచ్చారు. పోలింగ్ కేంద్ర వద్ద అధికార పార్టీ నేతలు కూడా ఉన్నారని వాళ్లను కూడా బయటకు పంపించాలని చింతమని డిమాండ్ చేశారు. ముందు రౌడీ షీటర్లను, ఆ తరువాత అందరని బయటకు పంపిస్తామని డీఎస్పీ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మళ్లీ వస్తానంటూ చింతమనేని ప్రభాకర్ అక్కడి నుంచి వెనుదిగిరి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రౌడీ షీటర్ లకి ఎంట్రీ లేదు..మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు డీఎస్పీ వార్నింగ్..!!#ChintamaneniPrabhakar #DSPAshokKumar #NTVNews #NTVTelugu pic.twitter.com/bamxnaennZ
— NTV Telugu (@NtvTeluguLive) August 19, 2023
ఇదీ చదవండి: అవును జగన్ తప్పు చేశాడు! రాజకీయాల్లో ఇంత నిజాయతి తప్పే!