sai
sai
యార్లగడ్డ వెంకట్రావ్ వైఎస్సార్‌సీపీ పార్టీని విడిన సంగతి తెలిసిందే. పార్టీని విడుతూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలో తనను అవమానించారని.. ఇక వైసీపీలో కొనసాగలేనని.. పైగా సజ్జల తనను పోతే పో అని దారుణంగా అవమానించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన యార్లగడ్డ.. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తరఫున తనకు అవకాశం ఇస్తే.. గన్నవరంలో గెలుస్తానని వ్యాఖ్యానించి.. టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఇక యార్లగడ్డ నిర్ణయంపై ఆయన అనుచరలే ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనంత మాత్రనా.. ఇన్నాళ్లు అక్కున చేర్చుకున్న పార్టీని.. అండగా నిలిచిన జగన్‌ని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అంటున్నారు జనాలు.
అసలు మీకు ఏం అన్యాయం జరిగిందని.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. తల్లి లాంటి పార్టీ మీద, సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు జనాలు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా గెలిచే వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. పార్టీ కోసం ప్రాణాలిచ్చే వారైనా సరే.. ఎన్నికల్లో వారు గెలిస్తినే అధిష్టానం దగ్గర తీస్తుంది. కానీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అలా కాదు. ఆయన వైఖరే భిన్నంగా ఉంటుంది అని గుర్తు చేసుకుంటున్నారు జనాలు.
రాజకీయాలు, గెలుపోటముల కన్నా.. పార్టీ, నాయకులతో మంచి సంబంధాలు, వారితో అనుబంధం ముఖ్యం అనుకుంటారు జగన్. అందుకే కదా.. 2019లో ఓడిపోయిన నేతలందరికి.. పదవులు ఇచ్చి ఆదరించారు. పార్టీని నమ్ముకుని ఉన్న ఏ ఒక్కరికి జగన్ అన్యాయం చేయలేదు. 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరి పోటీ చేసిన ఒకరిద్దరికి మినహా అందరికీ ఎమ్మెల్యే స్థాయి పదవులు ఇచ్చారు జగన్. అదే టీడీపీలో చూసుకుంటే.. 2014 ఎన్నికలలో తెలుగుదేశం నుండి ఓడిపోయిన వారిలో సోమిరెడ్డి కి మినహా ఎవరికీ ఏమీ ఇవ్వలేదు .
ఇలా తనను నమ్ముకుని.. ముందు నుంచి ఉన్న అందరికీ జగన్ న్యాయం చేశారు. బహుశా రాజకీయాల్లో ఇంత నిజాయతీగా ఉండటమే ఆయన చేసిన తప్పేమో. అందుకే మీరంతా తిన్నింటి వాసాలు లెక్కెపెడుతున్నారు అని చర్చించుకుంటున్నారు జనాలు. పార్టీలో మీకేదో అవమానం జరిగింది.. అందుకే వెళ్లిపోతున్నాము అంటున్నారు. పైగా పార్టీ గురించి, అధినేతపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఒక్కటి గుర్తు పెట్టుకొండి.. జనాలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీలాంటి నమ్మకద్రోహులకి సరైన విధంగా బుద్ధి చెబుతారు అంటున్నారు ఏపీ ప్రజలు.