Arjun Suravaram
ఇటీవల కాలంలో రాజకీయ రంగంలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా కుటుంబంలో కూడా విషాదం చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో రాజకీయ రంగంలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా కుటుంబంలో కూడా విషాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యం, రోడ్డు ప్రమాదం, గుండెపోటు వంటి ఇతర కారణాలతో పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. ఇలా వారి మృతి..కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతుంటారు. ఇటీవల కాలంలో పలువురు ప్రజాప్రతినిధులు అనారోగ్య కారణంతో మృతి చెందారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీడీపీ హయాంలో ఆయన నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో ఆయనతో పాటు టీడీపీ కూడా ఓటమి పాలైంది. ఇక ఈ విషయాలు పక్కన పెడితే.. ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ మృతి చెందారు. ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అప్పటి నుంచి చంద్రశేఖర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బుధవారం అర్థరాత్రి తీవ్ర గుండెపోటు వచ్చింది. వైద్యులు చికిత్స అందిస్తుండగానే చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు. చంద్రశేఖర్ అనారోగ్యానికి గురైన నాటి నుంచి కూడా దేవినేని ఉమా సైతం సోదరుడి వద్దే ఆస్పత్రిలోనే ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం చంద్రశేఖర్ పార్ధివ దేహాన్ని.. ఆయన స్వగ్రామం కంచికచర్ల లో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. చంద్రశేఖర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇక దేవినేని చంద్రశేఖర్ విషయానికి వస్తే.. ఆయన గతంలో టీడీపీ తరపున పని చేశారు. 2019 ఎలక్షన్ సమయంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ దోపిడీ ఎక్కువగా ఉందని, పట్టిసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టుల్లో దోపిడీ అధికంగా ఉందని అప్పట్లో సోదరుడు ఉమాపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా ఉమాను విమర్శించారు. అదే విధంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పై, ఆ పార్టీ అధినేత సీఎం జగన్ పై చంద్రశేఖర్ ప్రశంసలు కురిపించారు.
వైఎస్ జగన్ సీఎంగా అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించారని తెలిపారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ వారిపై మండిపడ్డారు. ఇలా దేవినేని చంద్రశేఖర్.. తరచూ టీడీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యే వారు. ఆయన వైసీపీ పార్టీకీ ఎనలేని కృషి చేశారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర వేదనకు గురయ్యారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. మరి.. దేవినేని చంద్రశేఖర్ మృతికి మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.