P Venkatesh
Gudlavalleru Engineering College: ఆంధ్రప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినుల హాస్టల్ వాష్ రూంలలో రహస్య కెమెరాలు ఉన్నాయని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐజీ కీలక ప్రకటన చేశారు.
Gudlavalleru Engineering College: ఆంధ్రప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినుల హాస్టల్ వాష్ రూంలలో రహస్య కెమెరాలు ఉన్నాయని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐజీ కీలక ప్రకటన చేశారు.
P Venkatesh
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్ లలో రహస్య కెమెరాల ఉన్నాయని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనుప్రకంపనలు సృష్టించింది. వాష్ రూమ్ లలో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి ప్రైవేట్ సైట్స్ కు అమ్ముతున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. నిందుతుల వద్ద 300 వీడియోలు ఉన్నట్లు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ తమ కాలేజీలో ఎటువంటి హిడెన్ కెమరాలు లేవని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సంచలన విషయాలను వెల్లడించారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?
గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమారాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో దీన్ని సవాల్ గా తీసుకున్నారు పోలీసులు. అసలు విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు కీలక చర్యలు చేపట్టారు. తొలిసారి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సేవలను యూజ్ చేసుకుని ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. కాలేజీలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం. కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారు. విచారణ నిష్పక్షపాతంగా జరిగిందన్నారు.
హిడెన్ కెమెరాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో హాస్టల్ వాష్ రూమ్‌ల్లో తనిఖీలు చేశాం అన్నారు ఐజీ అశోక్ కుమార్. వాష్ రూమ్‌లు, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదని స్పష్టం చేశారు. విద్యార్థినులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిని సీఈఆర్టీ సభ్యులకు అప్పగించామని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం సీఈఆర్టీ సభ్యులు రిపోర్టు అందిస్తారని వెల్లడించారు. ఈ ఘటనపై ఏవైనా ఆధారాలున్నట్లైతే తమ దృష్టికి తేవొచ్చని సూచించారు.