నగరవాసులకు అలర్ట్‌.. ఇకపై పెట్రోలు, డీజిల్‌ అలా అమ్మడం నిషేధం

పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలకు సంబంధించి పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు. ఆ వివరాలు..

పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలకు సంబంధించి పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటున్నారు. ఆ వివరాలు..

కొన్నిసార్లు బండిలో పెట్రోల్ ఎంత ఉందో చూసుకోకుండా బైక్‌ మీద ప్రయాణం ప్రారంభిస్తుంటాం. కొద్ది దూరం వెల్లగానే బండి ఆగిపోతుంది. చూస్తే పెట్రోల్‌ లేదు. బంకు దగ్గర్లోనే ఉంటే ఎలాగోలా బండిని తోసుకుంటూ వెళ్లి పెట్రోల్‌ కొట్టిస్తాము. దూరంగా ఉంటే.. వాటర్‌ బాటిల్‌, డబ్బా ఇలా ఏదోకటి తీసుకుని వెళ్లి పెట్రోల్‌ కొట్టించుకుని వస్తాము. అయితే ఇక మీదట ఇలా పెట్రోలు అమ్మకాలు జరపరాదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై నగరంలో ఇలా వాటరక్‌ బాటిల్స్‌లో పెట్రోలు, డీజిల్‌ కొట్టించుకుని రాలేము. మరి ఇంతకు పోలీసులు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. కారణాలు ఏంటి అంటే..

ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పల్నాడులో అయితే పెట్రోల్‌ బాంబులతో దాడులు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించేందుకు గాను పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరంలోని పెట్రోలు బంకుల్లో సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌లో పెట్రోలు, డీజిలు అమ్మకాలు నిషేధించారు. పెట్రోల్‌ బంకుల యజమానులందరూ కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని.. కాదని రూల్స్‌ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ఆదేశాల మేరకు.. బాటిల్స్‌, డబ్బాల్లో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మడం కుదరదని పెట్రోల్‌ బంకు యజమానులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ముఖేష్ కుమార్‌ మీనా.. పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. పోలీసులు ఇలాంటి నియమాలు తీసుకొచ్చారు. బంకు యజమానులు వీటిని కచ్చితంగా పాటించాలని కోరుతున్నారు.

ఇక ఏపీలో గతంలో ఎన్నడు లేని విధంగా పోలింగ్‌ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పోలింగ్‌ రోజు, ముగిసిన తర్వాత.. మూడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత.. ఈ స్థాయిలో ఘర్షణలు చెలరేగడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఘర్షణల గురించి ఈసీ అధికారులు పోలీసులను హెచ్చరించినప్పటికి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించడంలో పోలీసులు వైఫల్యం చెందారని.. అందుకే భారీగా హింసాత్మక ఘటనలు జరిగాయిన సీఎస్‌ జవహర్‌రెడ్డి నివేదిక అందించారు.

Show comments