iDreamPost
android-app
ios-app

ఏపీ, తెలంగాణలో ఓటు ఉంటే ఎలా? ఎన్నికల అధికారులు ఏం చెబుతున్నారంటే?

ఏపీకి చెందిన చాలా మంది ఉపాధి నిమిత్తం గతంలో హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిర పడిపోయారు. ఇంతే కాదు.. ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారు. ఇలా రెండు ప్రాంతాల్లో ఓటు కలిగిన వారికి ఎక్కడ ఓటు వేయాలి? అధికారులు ఏం చెబుతున్నారంటే?

ఏపీకి చెందిన చాలా మంది ఉపాధి నిమిత్తం గతంలో హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిర పడిపోయారు. ఇంతే కాదు.. ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారు. ఇలా రెండు ప్రాంతాల్లో ఓటు కలిగిన వారికి ఎక్కడ ఓటు వేయాలి? అధికారులు ఏం చెబుతున్నారంటే?

ఏపీ, తెలంగాణలో ఓటు ఉంటే ఎలా? ఎన్నికల అధికారులు ఏం చెబుతున్నారంటే?

మరికొన్ని రోజుల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాల్లోని వివిధ పార్టీలు ఇప్పటికే రక రకాల కార్యక్రమాలతో ప్రజల వద్దకు చేరుకుంటున్నాయి. అయితే ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనుండడంతో పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అభ్యర్థులు వివిధ రకాల హమీలతో ప్రజల వద్దకు వెళ్తూ ఓట అడుగుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీకి చెందిన చాలా మంది ఉపాధి నిమిత్తం గతంలో హైదరాబాద్ కు వచ్చారు. ఇక్కడే పని చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో స్థిర పడిపోయారు. ఇంతే కాదు.. ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారు. మరో విషయం ఏంటంటే? వీరికి తెలంగాణతో పాటు ఏపీలోకి కూడా ఓటు హక్కు ఉంటుంది. దీంతో వీళ్లు రెండు చోట్ల జరిగే ఎన్నికల్లో ఓటును కలిగి ఉండి ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్లి ఓటేస్తున్నారు.

అయితే ఈ అంశంపై తాజాగా ఏపీ ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పందించారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న విషయం మా దృష్టికి వచ్చిందని, ఇలా ఓటు హక్కు కలిగిన వారిని గుర్తించేందుకు ప్రస్తుతం ఆ సాఫ్ట్ వేర్ మా వద్ద లేదని అన్నారు. దీంతో వీళ్లు రెండు ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమయంలో ఇలాంటి ఓట్లను ఆపలేమని కూడా ఆయన కూడా స్పష్టం చేసినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఏపీ, తెలంగాణ ఎక్కడ ఎన్నికలు జరిగితే వాళ్లు అక్కడ ఓటు హక్కును వినియోగించోవడం విశేషం. ఇలాంటి ఓట్లను గుర్తించే సాఫ్ట్ వేర్ వచ్చేంత వరకు ఇది తప్పదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.