Krishna Kowshik
భార్యాభర్తలిద్దరూ వైద్యులే. ఆసుపత్రి నడుపుతున్నారు. చక్కనైన పిల్లలు. ఇంకే కావాలి.. సమస్యలేవీ లేవు అనుకున్నారు చూసిన జనం. కానీ తెల్లా సరికి ఆ వైద్యురాలు..
భార్యాభర్తలిద్దరూ వైద్యులే. ఆసుపత్రి నడుపుతున్నారు. చక్కనైన పిల్లలు. ఇంకే కావాలి.. సమస్యలేవీ లేవు అనుకున్నారు చూసిన జనం. కానీ తెల్లా సరికి ఆ వైద్యురాలు..
Krishna Kowshik
చదువుకున్నోళ్లు, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, ప్రాణాలు పోసే వృత్తిని చేపడుతున్న వైద్యులు కూడా ఆత్మహత్యలు ఒడిగడుతున్నారు. సూసైడ్ ఆలోచనల్ని నుండి బయటపడేయాల్సిన డాక్టర్సే.. ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే.. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సామాన్యుల పరిస్థితి అంచనా వేయలేం. సమస్యలు ఏదైనా ఆత్మహత్య వాటికి పరిష్కారం కాదని తెలిసి కూడా ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. రాత్రి భర్తతో గొడవ పడ్డ ఆమె.. తెల్లారే సరికి శవమై తేలింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని శ్రీ కాళ హస్తిలో.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాళ హస్తి టౌన్‌లోని కొత్త పేటలో నివాసం ఉంటున్నారు భార్యా భర్తలు డా. రాజేశ్, డా. అశ్వినీ. అశ్వినీకి ప్రముఖ వ్యాపార వేత్త సీతారామ రెడ్డి కొడుకు రాజేశ్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ వైద్యులే కావడంతో. కొత్తపేటలో అశ్విని క్లినిక్, డే కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ల వీరి కాపురం సజావుగానే సాగిపోయింది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య కూడా అప్పుడప్పుడు తగాదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇవి పీక్స్‌కు చేరినట్లు సమాచారం. బుధవారం రాత్రి కూడా టిఫిన్ విషయంలో రాజేశ్, అశ్వినీల మధ్య గొడవ జరిగింది. ఇది పెద్ద గొడవకు దారి తీసింది.
అనంతరం ఎవరి రూంలో వారు పడుకున్నారు. తెల్లారే సరికి తన గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది అశ్విని. ఉదయం కూతురు తలుపు కొట్టినా తీయలేదు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. అయితే భర్త రాజేశ్ కిటీలో నుండి చూడగా.. ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే తలుపులు పగులగొట్టి..పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందించారు. అశ్విని భర్త రాజేశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది ఆత్మహత్య లేక మరో కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. కొన్ని పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎంత డాక్టరైనా.. తాను సాటి మహిళల్లానే అని, భర్తతో హ్యపీ జీవితాన్ని ఊహించుకుని, అది సమస్యాత్మకం కావడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది.