iDreamPost
android-app
ios-app

పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీసుకు సీఎం జగన్ సాయం!

పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీసుకు సీఎం జగన్ సాయం!

ఇటీవలే చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే.   ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు  రెచ్చిపోయి.. పుంగనూరు బైపాస్ రోడ్డు వద్ద దాడులు చేశారు. టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. అలానే పోలీసులకు చెందిన రెండు వాహనాలను టీడీపీ శ్రేణులు తగలబెట్టారు. కర్రలు, రాళ్లు, బీరు బాటిలు వంటి వాటితో పోలీసులపై, వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. చాలా సేపు పుంగనూరు బైపాస్ రోడ్డు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ దాడుల్లో దాదాపు 13 మందికి పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడుల్లో రణధీర్ అనే పోలీస్ కానిస్టేబుల్ కి ఎడమ కంటి చూపు పోయింది. అతడికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం చేశారు.

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరు ప్రాంతం రణరంగా మారింది. టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి..దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ కూడా స్పందిస్తూ.. కీలక విషయాలను వెల్లడించారు. పుంగనూరులో పథకం ప్రకారమే పోలీసులపై దాడి జరిగిందని తెలిపారు. టీడీపీ శ్రేణులు విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారని ఆయన అన్నారు. “పుంగనరు ఘటనలో  కానిస్టేబుల్ రణధీర్.. ఎడమ కంటి చూపు పోయింది. అలానే ఈదాడిలో  మరో 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతీ కుటుంబానికి సీఎం జగన్ అండగా ఉంటామన్నారు. చూపు కోల్పోయిన రణదీర్ కు సీఎం జగన్ రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు” అని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.

మరోవైపు పుంగనూరు ఘటనపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “చంద్రబాబు నాయుడు విధ్వంసం సృష్టించాలని కుట్ర చేశాడు. రూట్ మ్యాప్ ప్రకారం కాదని, పుంగనూరులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అల్లరి మూకల దాడిలో  రణధీర్ అనే కానిస్టేబుల్ .. తన ఎడమ కన్ను చూపు కోల్పోయారు.చల్లా బాబు, చంద్రాబాబు ఒకే కారులో ప్రయాణిస్తూ దాడికి పథకం రచించారు.అసలు ఈ ఘటనలో ఏ1గా చంద్రబాబునే చేర్చాలి. పోలీసులు కాల్పులు జరపకుండా సంయమనం పాటించారు” అని డిప్యూటి సీఎం  అన్నారు. మరి.. పోలీస్ కానిస్టేబుల్ కు సీఎం ఆర్థిక సాయం అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చిత్ర పరిశ్రమ పిచ్చుక అని అంగీకరించారా? మెగాస్టార్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్!