iDreamPost

చిత్ర పరిశ్రమ పిచ్చుక అని అంగీకరించారా? మెగాస్టార్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్!

  • Author Soma Sekhar Published - 05:02 PM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Published - 05:02 PM, Tue - 8 August 23
చిత్ర పరిశ్రమ పిచ్చుక అని అంగీకరించారా? మెగాస్టార్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్!

సాధారణంగా చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఎంతో మంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర పాలిటిక్స్ మీద వేశారు. అయితే నిన్న మెున్నటి వరకు రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి సత్సంబంధాలు చాలా బాగుండేవీ. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పిచ్చుకపై బ్రహ్మాస్త్ర ప్రయోగాలు ఎందుకు అంటూ ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయాణ.

“మీలాంటి నాయకులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి, ప్రాజెక్ట్ ల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా అడుగులు వేయాలి. అలా చేస్తే అందరూ తలవంచి మీకు నమస్కరిస్తారు. అంతేగానీ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి” ఈ వ్యాఖ్యలు చేసింది మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక వేడుక చేసుకుంది. ఈ వేడుకలో భాగంగానే చిరంజీవి పైవ్యాఖ్యలు చేశారు.

కాగా.. చిరంజీవి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..”సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని చిరంజీవి అంగీకరిస్తున్నారా? ఏపీలో సంక్షేమ పథకాలు కింది స్థాయి ప్రజలకు కూడా అందుతున్నాయి. ఇలాంటి టైమ్ లో చిరంజీవి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో చెప్పాలి. ఇక మేం వారాహి యాత్రను అడ్డుకోం. అయితే యాత్రల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఊరుకోం. ఇది ప్రజాస్వామ్యం యాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు” అంటూ కౌంటర్ ఇచ్చారు బొత్స. ఇక విశాఖలో పవన్ వారాహి యాత్ర గురించి దేశం మెుత్తం మాట్లాడుకుంటుందని అంటున్నారు.. చంద్రబాబు పుంగనూరు యాత్ర మాదిరిగా విధ్వంసం చేయాలని చూస్తున్నారా? అంటూ ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. మరి మెగాస్టార్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వరద బాధితులకు CM జగన్ భరోసా.. నెలలోపే పంట నష్ట సాయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి