Arjun Suravaram
Memantha Siddham Day 2 Higlihts: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. బుధవారం ఇడుపులపాయలో ఈ యాత్ర ప్రారంభమైంది. తాజాగా రెండో రోజు నంద్యాలలో ఈ యాత్ర కొనసాగింది.
Memantha Siddham Day 2 Higlihts: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. బుధవారం ఇడుపులపాయలో ఈ యాత్ర ప్రారంభమైంది. తాజాగా రెండో రోజు నంద్యాలలో ఈ యాత్ర కొనసాగింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన సీఎం జగన్.. మరోసారి మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర బుధవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైంది. రెండవ రోజు నంద్యాల జిల్లాలో ఈ బస్సు యాత్ర కొనసాగింది.
బుధవారం ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఇడుపులపాయలో మొదలై.. కడప లోక్ సభ పరిధఇలో సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలానే ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఇక రెండో రోజు బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్ల గడ్డ నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో వివిధ గ్రామాల ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతూ తన బస్సు యాత్రను సాగించారు. యర్రగుంట్ల గ్రామంలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఇలా సాగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద సీఎం జగన్ కాన్వాయ్ వెనుక వస్తున్న అంబులెన్స్ వచ్చింది. దీంతో వెంటనే తన వాహనాల శ్రేణిని పక్కకు తప్పించి.. అంబులెన్స్ కు సీఎం జగన్ దారి ఇచ్చారు. సీఎం జగన్ ను చూసేందుకు భారీగా జనం చేరుకున్నారు. అయినప్పటికీ అంబులెన్స్ సజావుగా వెళ్లేలా సీఎం జగన్ సిబ్బందికి సూచనలిచ్చి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు.
అనంతరం వెంకటాపురం, గోవిందపల్లి మీదుగా దీబగుంట్ల సీఎం జగన్ చేరుకున్నారు. దీబగుంట్ల లో సీఎం జగన్ కి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ ను చూసేందుకు జనాలు భారీగా తరలి వచ్చారు. ఎండను సైతం లెక్క చేయుకుండా ఆయనకు అభివాదం చేసేందుక రోడ్లపై భారీగా నిల్చుకున్నారు. అక్కడ నుంచి నూనెపల్లి క్రాస్ దగ్గర భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సాయంత్రం నాలుగున్నరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అక్కడ సభ తర్వాత.. పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, నాగలాపురం మీదుగా పెంచికలపాడులోని నైట్ క్యాంప్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసి.. తిరిగి శుక్రవారం ముడో రోజు బస్సుయాత్రను కొనసాగించనున్నారు.