iDreamPost
android-app
ios-app

మీ కోసం 124 సార్లు బటన్ నొక్కాను.. నాకోసం ఒక్కసారి బటన్ నొక్కండి: CM జగన్

YS Jagan In Siddham Meeting: ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్ సీపీ సిద్ధం సభ జరిగింది. ఈ సభకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇక ఈ సభ నుంచి ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.

YS Jagan In Siddham Meeting: ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్ సీపీ సిద్ధం సభ జరిగింది. ఈ సభకు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఇక ఈ సభ నుంచి ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.

మీ కోసం 124 సార్లు బటన్ నొక్కాను.. నాకోసం ఒక్కసారి బటన్ నొక్కండి: CM జగన్

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎలక్షన్లలో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఇటీవలే భీమిలి నుంచి సిద్ధం సభతో ఎన్నికల సమర శంఖారావన్ని పూరించారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. అంతేకాక ప్రతిపక్షాలపై  ఓ రేంజ్ లో విరుచకపడ్డారు. తాజాగా ఏలూరు జిల్లాలో దెందులూరులో సిద్ధం సభ నిర్వహించారు. లక్షలాది మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. ఇక ఈ సభలో సీఎం జగన్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ప్రతిపక్ష టీడీపీకి ఎల్లో మీడియా, దత్తపుత్రుడు ఉన్నారని, తనకు మాత్రం ప్రజలే బలమని సీఎం జగన్ తెలిపారు.

ఏలూరు జిల్లాలో దెందులూరులో ‘సిద్ధం’ సభకు విచ్చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంతమంతా వైఎస్సార్ సీపీ జెండాలతో నిండిపోయింది. అంతేకాక ఈ సభ జన గోదావరిని తలపించింది. ఇక ఈ సభకు హాజరైన సీఎం జగన్…వైఎస్సార్ సీపీ శ్రేణులకు, నాయకులకు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. అంతేకాక తన ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి పనుల గురించి సీఎం వివరించారు. అవినీతి, వివక్షతకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని, చంద్రబాబు పాలనకు,  జగన్ పాలనకు తేడాను గమనించండంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.

ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ…”ప్రజలందరూ గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైనా తీసుకోండి. చంద్రబాబు హయాంలో ఇచ్చిన పథకాలు ఏమున్నాయో అడగండి. పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి. చంద్రబాబుకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడు, మరికొందరి మద్దతు ఉంది. నాకు మాత్రం ఉన్న సైన్యం, బలం..దేవుడు, ప్రజలు. వచ్చే ఎన్నికల్లో మీరంత కృష్ణుడైతే నేను అర్జునుడి. నేను ఈ 56 నెలల పాలనలో నేను మీ కోసం 126 సార్లు బటన్ నొక్కాను. మీరు నాకోసం ఒక్కసారి బటన్ నొక్కండి. ఒకటి అసెంబ్లీకి, మరొకటి పార్లమెంట్ కు ఫ్యాన్ గుర్తుపై నొక్కితే..గతంలో మీరు పెట్టేలో బంధించిన చంద్రముఖి బాధ మీకు శాశ్వతంగా ఉండదు” అంటూ సీఎం జగన్ తెలిపారు.

ఇంకా పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ సీఎం జగన్ మాట్లాడుతూ.. “మన ప్రభుత్వంలో వచ్చిన సచివాలయం వ్యవస్థతో గ్రామాల్లో వచ్చిన మార్పులు గమనించండి. ఈ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారండీ జగన్ అని చెప్పండి. ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతలకు పింఛన్ల అందిస్తున్నాము. అసెన్డ్ భూములకు శాశ్వత భూ హక్కు ఇచ్చాం. కేబినెట్ లో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. 4 డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్ తో సహా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజికి న్యాయాన్ని అమలు చేశాము. మన ప్రభుత్వంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్ లు నిర్మిస్తున్నాం. మహానేత వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తూ పాలన అందిస్తున్నాం. వచ్చే ఎన్నికలు..పేదల భవిష్యత్ ను నిర్ణయించేవి. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా?. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా?. దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా?” అంటూ పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

ప్రతిపక్షా టీడీపీ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబుకు పెత్తందారుల మద్దతు ఉంది.. జగన్ కి మాత్రం జనాల మద్దతు ఉందని తెలిపారు. ఇంతమంది తోడేళ్లు మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ నిజం ఏంటంటే.. కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు. మరి..దెందులూరు సభలో సీఎం జగన్ చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి