మానవత్వం చాటుకున్నCM జగన్.. రూ.33 లక్షల సాయం!

మానవత్వం చాటుకున్నCM జగన్.. రూ.33 లక్షల సాయం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మంచి మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి పేద వాడి గుండె చప్పుడు విని, వారి పరిస్థితిని అర్ధం చేసుకోవడంలో సీఎం జగన్ ముందుంటారు. ఇక సాయం కోరి వచ్చిన వారిని ఆదుకోవడంలో సీఎం జగన్ ముందుంటారు. గత కొంతకాలం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరు సీఎం సహాయం చేస్తారని ఆశగా వస్తున్నారు. వారందరిని నిరాశ పరచకుండా సీఎం జగన్ వారి సమస్యను తెలుసుకుని వారికి కావలసిన సహాయాన్ని, భరోసాను అందించి పంపుతున్నారు. తాజాగా ఓ  యవకుడి ఆపరేషన్ కి రూ.33 లక్షల ఆర్థిక సాయం చేశారు. గతంలో ఇచ్చిన మాటకు.. ఇలా సాయం చేసి.. ప్రాణాలను నిలిపారంటూ ఆ యువకుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మాట ఇచ్చారంటే. కచ్చితంగా చేస్తారని సీఎం జగన్  అనేక సార్లు నిరూపించుకున్నారు.  యువకుడి ఆపరేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.33 లక్షలు మంజూరు చేశారు. శస్త్ర చికిత్స అనంతరం తమ కుమారుడు  క్షేమంగా ఇంటికి రావడంతో సీఎం పునర్జన్మ ప్రసాదించారని శనివారం పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని కలిసి యువకుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మద్దికెర గ్రామానికి చెందిన పూజారి చిదానంద, ఈరక్క సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి  ఈరన్న అనే 24 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

అతడు కూడ అదే వృత్తిలో ఉంటూ కుటుంబానికి  చేదోడువాదోడుగా ఉంటడేవాడు. అనుకోకుండా ఒకరోజు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చూపించారు. ఈరన్నను పరీక్షించిన వైద్యులు పేగు పాడైందని, మార్చాలని, ఇందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇళ్లు గడవమే కష్టంగా భావించే ఆ కుటుంబం లక్షల రూపాయలు అనేసరికి  దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. జూన్ 1న పత్తికొండలో జరిగిన రైతు భరోసా కార్యక్రమానికి సీఎం జగన్ రావడంతో ఎమ్మెల్యే శ్రీదేవి, సహకారంతో సీఎంను  చిదానంద దంపతులు కలిశారు.

ఈరన్న ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం జగన్ కు వివరించారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం..వెంటనే  జిల్లా కలెక్టర్, సంబంధిత ఆరోగ్య  శాఖ అధికారులకు తెలియజేశారు. ఆపరేషన్ కు రూ.33 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పడంతో వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే  హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో పేగు మార్పిడి ఆపరేషన్ చేసుకుని ఈరన్న ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం కుమారుడు క్షేమంగా ఇంటికి రావడంతో సీఎం పునర్జన్మ ప్రసాదించారని శనివారం పత్తికొండ ఎమ్మెల్యేని.. ఈరన్న తల్లిదండ్రులు కలిశారు. తమ కుమారుడిని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Show comments