iDreamPost
android-app
ios-app

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నెల్లూరు జిల్లాలో 9వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-9: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర శనివారం తొమ్మిదవ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-9: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర శనివారం తొమ్మిదవ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నెల్లూరు జిల్లాలో 9వ రోజు హైలెట్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. సీఎం జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ఈ బస్సుయాత్ర విజయవంతంగా సాగింది. శనివారం దక్షిణ కోస్తా ప్రాంతమైన నెల్లూరు జిల్లాలో ఈ బస్సు యాత్ర ప్రారంభమైంది. తొమ్మిదవ రోజు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. మరి.. తొమ్మిదవ రోజు మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర శనివారం తొమ్మిదవ రోజు  నెల్లూరు జిల్లా కొనసాగింది. సీఎం జగన్ తలపెట్టిన మేమంత సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది నెల్లూరు జిల్లాలో సాగిన మేమంతా సిద్ధం యాత్రకు జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్ని సీఎం జగన్ కి అపూర్వ స్వాగతం పలికారు. తొమ్మిదవ రోజు చింతరెడ్డిపాలెం నుంచి శనివారం  ఉదయం 9 గంటలకు బస్సుయాత్ర ప్రారంభమైంది. కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నేతలను సీఎం జగన్ కలిసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.

ఇక  సీఎం జగన్ నెల్లూరు సిటీలోకి ఎంట్రీ అయ్యే సమయంలో రూరల్ అభ్యర్థి అదాల ప్రభాకర్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికారు.  అలానే కొవ్వూరు నియోజవర్గంలో ఎమ్మెల్యేనల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్వంలో సీఎం జగన్ కి ఘన స్వాగతం పలికారు. రేగడి చెలిక వద్ద రోడ్లు మీద ప్లకార్డు పట్టుకొని ఉన్న యువతిని చూసి సీఎం జగన్ కాన్వాయ్ ఆపారు.  ఆమె సమస్యను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలనే అధికారులను ఆదేశించారు. టీవీ యాక్టర్, కమెడియన్ రియాజ్ సీఎం జగన్ ను కలిశారు. ఇక నెల్లూరు జిల్లాలో సాగిన ఈ బస్సుయాత్రలో సీఎం జగన్ ను చూసేందుకు  భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం జగన్ కోసం ఎదురు చూశారు. ఇక సీఎం జగన్ సమక్షంలో జనసేన అమలాపురం నియోజవర్గ ఇన్ ఛార్జి శెట్టి బత్తుల రాజబాబు వైసీపీ లో చారు. అలానే జనసేన పార్టీకి చెందిన వివిధ విభాగాల నేతలు కూడా వైసీపీలో చేరారు. ఇక సాయంత్ర 3 గంటలకు కావాలిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.

సీఎం జగన్ ర్యాంప్ వాక్ మీద నడుస్తూ లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు.  కావలిలో జరిగిన బహిరంగ సభలో జనం పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఈ సభకు హాజరయ్యారు. ఇక సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ, ఓగూరు,కుందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుండ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు. ఇక ఈ  యాత్రలో సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతూ వారికి అందుతున్న సంక్షేమంపై ఆరా తీశారు. ఇక నెల్లూరు జిల్లాలో సాగిన సీఎం జగన్ బస్సుయాత్రలో సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా సాయం పొందిన వారు సీఎం జగన్ ను కలిసి..తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పలు గ్రామాల్లోని ప్రజలు సీఎం జగన్ కు పూలు చల్లుతూ, గజమాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఇలా తొమ్మిదవ రోజు సీఎం జగన్ పర్యటన నెల్లూరు జిల్లాలో విజయవంతంగా సాగింది.