iDreamPost
android-app
ios-app

ప్రతి పేదవాడి సొంతింటి కళను నెరవేర్చాం: సీఎం జగన్

  • Published Oct 12, 2023 | 1:19 PM Updated Updated Oct 12, 2023 | 1:19 PM
ప్రతి పేదవాడి సొంతింటి కళను నెరవేర్చాం: సీఎం జగన్

ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ వైసీపీ పలు అభివృద్ది సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం చుడుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా కాకినాడ జిల్లా సామర్ల కోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. నేడు ఆయన సామర్ల కోట-ప్రతిపాడు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీని ప్రారంభించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించాం. మరో 21 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. త్వరలో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయి. ఇప్పటికే 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయిస్తున్నాం. రూ.12 లక్షల విలువైన ఇంటి స్థలం ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలన్నదే  ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటి వరకు 35 కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. పేదల జీవితాల్లో మార్పే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. కోవీడ్ వచ్చినా తమ ప్రభుత్వం ఎలాంటి సాకులు చెప్పకుండా సంక్షేమ పథకాలు అమలు పరిచింది. ఇళ్ల స్థలాల కోసం 72 వేల ఎకరాలు సేకరించాం. 31 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.75,000 కోట్లు. ఒక్కో ఇంటి నిర్మాణం పై రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. మౌలిక సదుపాయల కల్పన కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

చంద్రబాబు పాలనలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వేలేదు.  వేల కోట్ల సంపద ఉన్నా కుప్పంలోనూ పేదలకు సెంటు స్థలం ఇవ్వేలేదు. కానీ మా ప్రభుత్వం  కుప్పంలో 20 వేల ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కి రాష్ట్రంపై ఏమాత్రం బాధ్యత లేదు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు రాష్ట్రంలో ఒక్క ఇళ్లు కూడా కట్టుకోలేదు. పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ లో చంద్రబాబు ఇళ్లు నిర్మించుకున్నారు. ప్యాకేజ్ స్టార్ కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఆయన శాశ్వత చిరునామా హైదరాబాద్ అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. వివాహ వ్యవస్థపై దత్త పుత్రుడికి గౌరవం లేదు.  అభిమానుల ఓట్లను హోల్ సేల్ గా అమ్ముకునేందుకు ప్యాకేజ్ స్టార్ పర్యటనలు చేస్తున్నారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్ కళ్యాణ్. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు.. ఇలాంటి వ్యక్తులు ఎలా జనాల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ చంద్రబాబు, పవన్ పై నిప్పులు చరిగారు.  సీఎం జగన్ మాట్లాడుతున్నంత సేపు ఆ ప్రాంతం మొత్తం చప్పట్లతో మారుమోగింది.