P Krishna
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేద ప్రజల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేద ప్రజల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
P Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పాతయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం విదేశీ పెట్టుబడులు వచ్చేలా చేస్తూ.. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..
ఏపీలో సీఆర్‌డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు జగన్ సర్కార్ మరో శుభవార్త అందించారు. భూమి లేని నిరుపేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పెంచిన పెన్షన్ మార్చి 1 నుంచి అంటే శుక్రవారం నుంచి అందించనున్నట్లు పేర్కొంది. అమరావతి ఏపీ సీఆర్‌డీఏ పరిధిలో భూమి లేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తున్నారు. మార్చి 1 నుంచి దాన్ని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీ లక్ష్మి ఒక గెజిల్ ని రిలీజ్ చేశారు. ఏపీలోని సీఆర్ డీఏ పరిధిలో గ్రామాల్లో 17,215 మంది లబ్దిదారులకు మేలు జరుగుతుందని అంటున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై సీఆర్‌డీఏ పరిధిలో నివసించే నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పార్టీ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది పనుల గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రతిపక్షనేతలు అధికార పార్టీపై పలు విమర్శలు చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. అధికార పార్టీ తమకు మరో ఛాన్స్ ఇస్తే.. ఆంధ్రప్రదేశ్ ని మరింత అభివృద్ది పథంలోకి తీసుకువెళ్తామని హామీ ఇస్తుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న అభివృద్ది పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. మరోసారి తమకు ఛాన్స్ ఇస్తారని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.