iDreamPost
android-app
ios-app

పెళ్లి బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్!

పెళ్లి బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్!

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో పెళ్లి బస్సు సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. అలానే 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను దర్శిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలానే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో పెళ్లి బృందం వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వివాహ రిసెప్షన్ కోసం పొదిలి నుంచి కాకినాడకు ఆర్టీసీ బస్సులో బయలు దేరారు. సోమవారం సాయంత్రం పొదిలి నుంచి బయల్దేరిన వీరి వాహనం.. అర్ధరాత్రి దాటిన తరువాత ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న సాగర్ కాల్వలో పడిపోయింది.  ఈ  ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయి వారిలో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి, యువకుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు..హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ బస్సులో 30 నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలానే  బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గే ప్రమాద స్థలానికి వెళ్లి..  పరిశీలించారు. ఆమె.. బాధితులతో మాట్లాడి.. వారికి ధైర్యాన్ని ఇచ్చారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసులు  సిబ్బందితో సహా, ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని అధికారులు సీఎం కు వివరించారు. ఈ ఘటనలో  గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం   అధికారులను ఆదేశించారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు అధికారులు తోడుగా నిలవాలన్నారు.