CM జగన్ క్రిస్మస్ వేడుకలు.. అమ్మతో కలిసి ఆనందంగా

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల కడప పర్యటనలో భాగంగా మూడో రోజు క్రిస్మస్ సందర్భంగా కడపలోని పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల కడప పర్యటనలో భాగంగా మూడో రోజు క్రిస్మస్ సందర్భంగా కడపలోని పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా  క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలానే మన దేశంలో కూడా క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని చర్చిలన్ని విద్యుత్ దీపాలతో ముస్తాభయ్యాయి. ఉదయం నుంచి అందరూ చర్చిలకు వెళ్లి..ప్రార్థనలు  చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ క్రిస్మస్ సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చి లో సీఎం జగన్ తో పాటు, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైయస్ విజయమ్మ కేక్ కట్ చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా  ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ పులివెందుల్లోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననారు. సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఇడుపులపాయ నుండి బయలుదేరి 8.50 నిమిషాలకు పులివెందులలోని భాకరాపురం హెలిపాడ్ కు చేరుకున్నారు. అక్కడ నుండి సీఎం జగన్ నేరుగా సీఎస్ఐ చర్చి కి వెళ్లారు. ఇక ఈ వేడుకలకు సీఎం జగన్ తో పాటు తల్లి వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.

ఇక సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్ధనలు చేశారు. ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ , నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనలను సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ విషెష్ తెలియజేశారు. ఇక ఈ వేడుకల్లో సీఎం జగన్.. విజయమ్మకు కేక్ ను తినిపించారు.  అలానే 2024 నూతన సంవత్సర  క్యాలెండర్ ను సీఎం జగన్, వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు.

ఈ వేడుకుల్లో వీరితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ఈ వేడుకలో సీఎం జగన్  ను తల్లి విజయమ్మ ఎంతో ఆప్యాయంగా పలకరించింది. చాలా మంది వీరిపై చేసిన  తప్పుడు ప్రచారాలకు విజయమ్మ గట్టిగా సమాధానం ఇచ్చారని పలువురు అభిప్రాయా పడుతున్నారు. తల్లిని దూరం పెట్టాడంటూ సీఎం జగన్ పై, ఆయన తల్లిపై ప్రతిపక్ష పార్టీ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. అంతేకాక వీరి మాటలకు ఎల్లో మీడియా తోడై.. తల్లిని దారుణంగా మోసం చేశాడని, వారిద్దరికి మాటలు లేవని, ఇలా ఎన్నో అసత్య ఆరోణపలు చేశారు.

అయితే తల్లిబిడ్డల మధ్య ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరం లేదని చాలా మంది అభిప్రాయా పడారు. ఆ ఆప్యాయతలు సమయం వచ్చినప్పుడు అవే బయట పడతాయన్నారు. ఇదే క్రిస్మస్ వేడుకల సందర్భంగా జరిగింది. పులివెందుల చర్చిల్లో సీఎం జగన్, ఆయన తల్లి గారు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ఇద్దరు కలిసి చక్కగా కేక్ కట్ట్ చేశారు. ఈ ఘటన అబద్ధపు రాతలు రాసే వారికి చెంపపై గట్టిగా కొట్టినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు, పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. మరి.. ఈ అపూర్వ దృశ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments