iDreamPost
android-app
ios-app

జగన్ మాస్టర్ ప్లాన్.. పవన్ పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు గల్లంతు!

YS Jagan, Pawan: ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. వేసవికాలం రాకముందే.. ఆ స్థాయిలో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్షాలు అయోమయానికి గురవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

YS Jagan, Pawan: ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. వేసవికాలం రాకముందే.. ఆ స్థాయిలో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్షాలు అయోమయానికి గురవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ మాస్టర్ ప్లాన్.. పవన్ పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు గల్లంతు!

రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు అనేవి ప్రధానమైనవి. ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఎన్నికల సమరంలోకి దిగితే ఓటమి తప్పదు. ప్రత్యర్థి ఊహాలకు అందకుండా ప్లాన్లు రచిస్తూ.. ఎంతో మంది నేతలు తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తుంటారు. అలానే ప్రత్యర్థి పార్టీ వాళ్లు పెట్టుకునే ఆశలను గల్లంతూ చేస్తుంటారు. తాజాగా ఏపీలోనూ అదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నట్లు పలువురు అభిప్రాయా పడుతున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ కి చంద్రబాబు..పవన్ కల్యాణ్ పై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడీ రాజుకుంది. ఇక్కడి రాజకీయం చాలా రసవత్తరంగా  సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సరిహద్దులు దాడుతుంది. ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తులకు, వ్యూహాలకు టీడీపీ, జనసేన కూటమి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తాను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి, ముందుకెళ్తూనే ప్రత్యర్థి వదులుకునే ఏ చిన్న అవకాశాన్ని సీఎం జగన్ వదులుకోవడం లేదనేది చాలా మంది అభిప్రాయం. అందుకు ఉదాహరణ కేశినేని నాని తో పాటు పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడం. అలానే ఇప్పటి వరకు ఏ ఓట్ల కోసం అయితే పవన్ కల్యాణ్ తో చంద్రబాబు కలిశాడో.. వాటిపైన కూడా సీఎం జగన్ నీళ్లు చల్లాడనే టాక్ వినిపిస్తోంది.

కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఓటర్లు పవన్ వెంటే ఉంటూ తమ పార్టీకి అనుకూలంగా ఉంటారని చంద్రబు ఆశలు పెట్టుకున్నాడు. అయితే పవన్ కల్యాణ్ తీసుకున్న సీట్లు, ఇటీవల చేసిన వ్యాఖ్యల కారణంగా చాలా మంది కాపు ఓటర్ల అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో కాపు ఉద్యమ నేతలు, చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ్డ పద్మనాభం వంటి నేతలు పవన్ కల్యాణ్ కి  పలు సూచనలు చేశారు. అయితే…తనకు ఎవరూ సలహా  ఇవ్వొద్దంటూ పవన్ కల్యాణ్ పరోక్షం వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో పలువురు కాపు నేతలు పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించి..సమూచిత స్థానం కల్పిస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల చేగొండి కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో  చేరారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో  చేరడం కన్ఫామ్ అయింది. ఇలా కాపు సామాజికి వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీలో చేరడంతో ఆ  ఓట్లు వైసీపీకే పడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.