iDreamPost
android-app
ios-app

YS Jagan: అంబులెన్స్ లోని షేషంట్ ను పరామర్శించిన CM జగన్.. ఇది కదా లీడర్ అంటే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. మేమంత సిద్దం పేరుతో సాగుతున్న బస్సుయాత్రలో సీఎం జగన్‌ కాన్వాయ్‌ వెళ్లున్న మార్గంలో 108 అంబులెన్స్‌ లో ఓ పేషంట్ ఉన్నాడు. అతని విషయంలో సీఎం జగన్ మంచి మనస్సు చాటుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. మేమంత సిద్దం పేరుతో సాగుతున్న బస్సుయాత్రలో సీఎం జగన్‌ కాన్వాయ్‌ వెళ్లున్న మార్గంలో 108 అంబులెన్స్‌ లో ఓ పేషంట్ ఉన్నాడు. అతని విషయంలో సీఎం జగన్ మంచి మనస్సు చాటుకున్నారు.

YS Jagan: అంబులెన్స్ లోని షేషంట్ ను పరామర్శించిన CM జగన్.. ఇది కదా లీడర్ అంటే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను చేపట్టారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం రేయింబవళ్లు కృషి చేశారు. ఇలా పరిపాలనలోనే కాకుండా సాయం అంటూ వచ్చే ప్రతి ఒక్కరిన అక్కున చేర్చుకుని, వారికి భరోసా ఇస్తూ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి సీఎం జగన్  సాయం అందించారు.  తాజాగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్‌ కాన్వాయ్‌ వెళ్లున్న మార్గంలో 108 అంబులెన్స్‌ ఓ పేషంట్ వచ్చారు. దీంతో వెంటనే సీఎం జగన్ తన బస్సును ఆపి అంబులెన్స్‌లోని పేషంట్ పరామర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేపట్టి ప్రజల్లో దూసుకెళ్తున్నారు. 17వ రోజు బస్సుయాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. 17 రోజు బస్సుయాత్రలో కోనసీమ ప్రజలు సీఎం జగన్ కి బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపు..సీఎం జగన్ ప్లెక్సీలు, ఫోటోలు పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో పలువురు వృద్ధులు, మహిళలు వచ్చి..సీఎం జగన్ ని కలిశారు. తమకు ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ ఫలాలు చెబుతూనే తమ సమస్యలను సీఎం జగన్ కి చెప్పుకున్నారు. అయితే వారి మాటలను ఎంతో ఓపికగా విన్న సీఎం జగన్ నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ భరోసా కల్పించారు.

ఇక 17వ రోజు యాత్రలో  రావుపాలెంల పరిధిలోని మడికి  గ్రామంలో సీఎం జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. మడికి గ్రామంలోకి సీఎం  జగన్ బస్సురాక కోసం.. ఓ పేషెంట్ ,అతని కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. రోడ్డుపక్కన అంబులెన్స్ లో పేషంట్ ను పెట్టుకుని ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు ఆప్రాంతానికి రానే వచ్చింది. అంబులెన్స్ లో ఉన్న పేషంట్ ను సీఎం జగన్ చూశారు. వారి పిలుపును విని బస్సు  పని తన సిబ్బందికి సూచించారు.

అనంతరం అంబులెన్సు లో వచ్చిన పేషెంట్ ను సీఎం జగన్ గారు స్వయంగా వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఓ ప్రమాదంలో గాయపడి ట్రీట్మెంట్  తీసుకుంటున్న సదరు వ్యక్తికి మరింత సహాయం కావాలని బాధితులు సీఎం గారిని కోరడం జరిగింది. అవసరమైన సహాయం అందిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ నే స్వయంగా తమ వద్దకు రావడంపై ఆ సదరు వ్యక్తి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పై తన మంచి మనస్సును చాటుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కదా నాయకుడు అంటే సీఎం జగన్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.