iDreamPost
android-app
ios-app

రీల్ స్టార్‌పై రియల్ స్టార్ ను పోటీకి నిలబెడుతున్న CM జగన్!

Grandhi Srinivas: ఏపీ రాజకీయాలు చాాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అందరిలో ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Grandhi Srinivas: ఏపీ రాజకీయాలు చాాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అందరిలో ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రీల్ స్టార్‌పై రియల్ స్టార్ ను పోటీకి నిలబెడుతున్న CM జగన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నాడు. అభ్యర్థుల విషయంలో అనేక మార్పులు చేస్తూ ప్రత్యర్థి పార్టీలను సైతం కన్ఫూజ్ చేస్తున్నారు. దీంతో విపక్షాలు సైతం ఏం చేయాల్లో అర్థంకాని స్థితిలోకి వెళ్లేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా భీమవరంలో జరిగిన సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీల్ స్టార్ పై రియల్ స్టార్ ను పోటీకి నిలబెడుతున్నట్లు ఆయన తెలిపారు. మరి.. ఆ రీల్, రియల్ స్టార్లు ఎవరు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రవారం సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటించారు. జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. భీమవరం పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశామని, కానీ ప్యాకేజీల కోసం త్యాగాలు చేసిన వారిని చూసి ఉండమంటూ సీఎం ఎద్దేవా చేసారు. ఇటు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థల మార్పు పై కసరత్తు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి భీమవరంలో తమ అభ్యర్దిని ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లొ పోటీ చేస్తారని ప్రకటించారు.

jagan comments on pawan kalyan

2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఈ రెండు స్థానాలాలో పోటీ చేసిన పవన్ ఓటమినే చవి చూశారు. గాజువాకలో తిప్పల నాగేశ్వర రెడ్డి చేతిలో, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ ఓటమి పాలయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో అనేక వార్తలు వినిపిస్తోన్నాయి.  కాకినాడ, పిఠాపురం, తిరుపతి, గాజువాక.. వీటిల్లో ఏదో ఒక నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు పలు నియోజకవర్గాల పేర్లు కూడా వినిపిస్తోన్నాయి. అయితే మరోసారి కూడా భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారనే వాదనలు బలంగా వినిపిస్తోన్నాయి. ఒక వేళ నిజంగా అదే జరిగితే.. రీల్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఢీకొట్టే రియల్ స్టార్ ఎవరు అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సీఎం జగన్ భీమవరంలో పర్యటించారు. పవన్ కల్యాణ్ ను ఢీకొట్టే రియల్ స్టార్ ఎవరు అనేది క్లారిటీ ఇచ్చారు.

గత ఎన్నికల్లో పవన్ ను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను తిరిగి అభ్యర్దిగా జగన్ ఖరారు చేశారు.  సీఎం జగన్ మాట్లాడుతూ.. మరోసారి రీల్ స్టార్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారని, ఆయన చేసినా, చేయకున్నా రియల్ స్టార్ గా ప్రజల కోసం పనిచేసే గ్రంథి శ్రీనివాస్ ను అప్పగిస్తున్నానని జగన్ తెలిపారు. శ్రీనివాస్ తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా..భీమవరం జిల్లా కేంద్రం కావాలని కోరారని సీఎం వెల్లడించారు. ఈ సభలో సీఎం జగన్.. పవన్ కల్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ  దత్తపుత్రుడి శాశ్వత నివాసం పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉందన్నారు.  పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ, పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఈయనే అని తెలిపారు.

దేశంలో   ఏ నాయకుడు ఇలా ఉండరని సీఎం ఎద్దేవా చేశారు. ఈ మనిషి బాబు  సీఎం అయితే చాలు అవే మాకు వందల కోట్లు అన్నట్లుగా, బాబు కోసమే తన జీవితమే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. దీనికి అంగీకరించని వారు తన పార్టీలో ఉండకూడదని, వేరే అభిప్రాయం ఉండదని తన సభల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారని వివరించారు. ఈ దత్తపుత్రుడు పొత్తుల్లో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే.. చిత్తం ప్రభు.. అంటూ త్యాగాల త్యాగరాజును ఈ దత్తపుత్రుడడిలో చూస్తామంటూ వ్యాఖ్యానించారు.