iDreamPost
android-app
ios-app

వీడియో: సీఎం జగన్ పనికి అందరూ శభాష్ అంటారు!

వీడియో: సీఎం జగన్ పనికి అందరూ శభాష్ అంటారు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి అందరికి తెలిసిందే. ఆయన చాలా సాదాసీదాగా, అతి సామాన్యుడి మాదిరిగానే ఉంటారు. జగన్ అధికారంలోకి రాకముందు ఆయన్ను అందరు విమర్శించారు. ప్రతిపక్షం, అధికారం.. ఇలా ఎక్కడ ఉన్నా..ఎప్పుడు ఒకేలా ఉంటారు. ప్రజల్లో కలిసిపోవడంలో ఆయనది ప్రత్యేకమైన విధానం. పలు సందర్భాల్లో అధికారులకు తానే  కొన్ని వస్తువులను అందించిన ఘటనలు జరిగాయి. అలానే వివిధ సందర్భాల్లో అధికారులతో, ప్రజలతో అతి సామాన్యంగా కలిసిపోయి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా విశాఖపట్నం పర్యటనలో సీఎం జగన్ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు.  తన వెంట ఉన్న ఇన్ఫోసిస్ డైరెక్టర్  షూ ను కట్టుకునే సమయంలో ఆయన పడిపోకుండా సీఎం జగన్ పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు ఐటీ , ఫార్మా కంపెనీల ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను సీఎం జగన్ నిర్వహించారు.  విశాఖలోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని  సీఎం జగన్ ప్రారంభించారు. అంతేకాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనుల చేశారు.  ఈ టూర్ లోనే  ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.   జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ సమయంలో ఇన్ఫోసిస్ డైరెక్టర్లు  తమ షూని విడిచారు. జ్యోతిని వెలింగిచిన అనంతరం తిరిగి షూ వేసుకునే పనిలో  ఉన్నారు. వారి కోసం సీఎం జగన్ చాలా సమయం పాటు వేచి ఉన్నారు.

అంతేకాక తొందరేమి లేదు అన్నా.. నిదానంగానే వేసుకోండి నేను వేయిట్ చేస్తానన్నట్లు సీఎం జగన్ అక్కడే నిల్చున్నారు. అంతేకాక వారిలో ఒక వ్యక్తి షూ కట్టుకుంటున్న సమయంలో ఆయన పడిపోకుండా సీఎం జగన్ పట్టుకున్నారు. ఇక ఈ దృశ్యం చూసిన అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి  సింప్లిసిటీకి అందరూ ఫిదా అయ్యారు. ఇక పక్కనే ఉన్న మంత్రులు విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్ అయితే చిరునవ్వులు చిందించారు. అనంతరం అందరూ అక్కడ ఏర్పాటు చేసిన సభప్రాంగాణానికి వెళ్లారు. ప్రస్తుతం సీఎం జగన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగనన్న గ్రేట్ అంటూ వైసీపీ అభిమానులు అంటుంటే.. ఏ సీఎం అయినా  ఇలా చేస్తాడా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. సీఎం జగన్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి