iDreamPost
android-app
ios-app

CM Jagan: మాట నిలబెట్టుకున్న CM జగన్‌.. కుప్పానికి కృష్ణా జలాలు

  • Published Feb 26, 2024 | 10:47 AM Updated Updated Feb 26, 2024 | 10:47 AM

ఏడుసార్లు కుప్పం నుంచి గెలిచినా.. కనీసం మంచి నీటి సౌకర్యం కల్పించలేదు చంద్రబాబు నాయుడు. కానీ సీఎం జగన్‌ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ వివరాలు..

ఏడుసార్లు కుప్పం నుంచి గెలిచినా.. కనీసం మంచి నీటి సౌకర్యం కల్పించలేదు చంద్రబాబు నాయుడు. కానీ సీఎం జగన్‌ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ వివరాలు..

  • Published Feb 26, 2024 | 10:47 AMUpdated Feb 26, 2024 | 10:47 AM
CM Jagan: మాట నిలబెట్టుకున్న CM జగన్‌.. కుప్పానికి కృష్ణా జలాలు

మాట మార్చడం.. నమ్మిన వాళ్ల గొంతు కోయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ వర్గాలు నిత్యం ప్రచారం చేస్తుంటాయి. తనకు లాభం లేనిది చంద్రబాబు ఏ పని చేయడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధిని మాత్రం ఆయన అసలు పట్టించుకోలేదన్నది వాస్తవం. ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచినా.. నియోజకవర్గాన్ని ఏమాత్రం డెవలప్‌ చేయలేదు. కనీసం నియోజకవర్గానికి మంచి నీటిని కూడా తీసుకురాలేదు. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కుప్పానికి కృష్ణా జలాలు తీసుకువచ్చారు. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ-నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. సీఎం జగన్‌ సోమవారం ఈ ప్రాజెక్ట్‌ కింద ఉన్న కాలువల్లోకి కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం కోసం సీఎం జగన్‌ సర్కార్‌ 697 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

ఆ తర్వాత నియోజవర్గంలోని మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌ తాము దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని కుప్పం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పూర్తే నిదర్శనమని వారు ప్రశంసిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌.. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం కింద 1987లో దీనికి శంఖుస్థాపన చేశారు. ఇక చంద్రబాబు వరుసగా ఏడుసార్లు కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచినా సరే.. అడ్డగోలుగా దోచేసి అభివృద్ధి గురించి అసలేం పట్టించుకోలేదు. ప్రాజెక్ట్‌ను తన అనుయాయులకు కట్టబెట్టి.. భారీగా నగదు దోచేశారు. కానీ, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కుప్పంను మున్సిపాల్టీని చేయడంతోపాటు దీని కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను, పోలీసు సబ్‌ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. రూ.66 కోట్లతో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.

అంతేకాక 2022, సెప్టెంబర్‌ 23న కుప్పంలో సీఎం జగన్‌ పర్యటించారు. ఈ సమయంలోనే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తిచేసి.. కృష్ణా జలాలను అందించి నియోజకవర్గాన్ని సుభిక్షం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆ పనులను 2023, డిసెంబరు 15 నాటికే ఆ పనులు పూర్తిచేయించారు. పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి మూడు దశల్లో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు కృష్ణా జలాలను ఎత్తిపోయడం 2023, డిసెంబర్‌ 18న ప్రారంభించారు. ఇక నేడు కృష్ణా జలాలు విడుదల చేసి.. జాతికి అంకితం చేయనున్నారు.