iDreamPost
android-app
ios-app

వీడియో: సీఎం మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ఎదుటి వారిపై గౌరమే!

వీడియో: సీఎం మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ఎదుటి వారిపై గౌరమే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర పరిపాలనలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి..అన్ని వర్గాల ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.  ఎదుటి వారిని ప్రేమించడం, మర్యదగా మాట్లడటం , గౌరవించడం సీఎం జగన్ ప్రత్యేకత. ప్రతి మీటింగ్ లోనూ ప్రజలపై తనకు ఉన్న ప్రేమను, గౌరవాన్ని సీఎం వ్యక్త పరుస్తుంటారు. అయితే కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా సీఎం అనేక సందర్భాల్లో ఎదుటి వారిపై తన గౌరవాన్ని చూపించారు. అందుకు తన స్థాయిని పక్కన పెట్టి మరీ ఆయన ఓ మెట్టుకిందకు దిగుతుంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చోటుచేసుకుంది.

మంగళవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. అనంతరం పోలీస్ శాఖలోని పలువురు అధికారులకు సీఎం జగన్  మెడల్స్ అందచేశారు. ఈ క్రమంలో ఆసక్తికర దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే ఓ పోలీస్ అధికారికి మెడల్ కిందపడిపోయింది.

అది గమనించకుండా సదరు పోలీస్ అధికారి ముందుకు వెళ్లిపోసాగాడు. అయితే  ఆ మెడల్ కింద పడటాన్ని గమనించి సీఎం జగన్…. ఆ పోలీస్ ను ఆపారు.  అంతేకాక తన స్థానం వద్ద నుంచి కిందకు దిగి..కిందపడిన మెడల్ ను తీశాడు. అనంతరం మెడల్ ను తీసి మళ్లీ పోలీస్ అధికారి  యూనిఫామ్ కు అంటించారు. ఈ దృశ్యాన్ని చూసిన అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగనన్న అంటే ఇలా ఉంటారు అంటూ.. ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. మరీ.. వైరల్ అవుతున్న సీఎం జగన్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విద్యాశాఖపై సీఎం జగన్‌ కీలక సమీక్ష..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి