iDreamPost
android-app
ios-app

ముస్లింలకు శుభవార్త చెప్పిన CM జగన్‌! ఇలాంటి భరోసా కదా మైనార్టీలు కోరుకునేది!

CM Jagan, Muslim Reservations: ఏపీలో ఎన్నికల వేడీ ..సమ్మర్ హీట్ కి ఏమాత్రం తీసిపోవడం లేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే సమయంలో ముస్లిం రిజర్వేషన్ విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Jagan, Muslim Reservations: ఏపీలో ఎన్నికల వేడీ ..సమ్మర్ హీట్ కి ఏమాత్రం తీసిపోవడం లేదు. అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే సమయంలో ముస్లిం రిజర్వేషన్ విషయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముస్లింలకు శుభవార్త చెప్పిన CM జగన్‌! ఇలాంటి భరోసా కదా మైనార్టీలు కోరుకునేది!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమరం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. అలానే ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికల ప్రచారం ముగించిన సీఎం వైఎస్ జగన్ మోహన్  రెడ్డి..మూడో విడత ప్రచారం చేస్తూ.. ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష కూటమి కూడా గెలుపే లక్ష్యంగా ఇదే ఎన్నికల ప్రచారం చేస్తుంది. అయితే ఇలా ఎన్నికల హీట్ ఓ రేంజ్ లో ఉన్న సమయంలో ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రత్యేకంగా నిలించింది. ఈ క్రమంలో ముస్లింకి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో కీలక  వ్యాఖ్యలు చేశారు.

2024 లోక్ సభ ఎన్నికల సమయం ముంచుకోస్తోదిం. ఇదే సమయంలో ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్ల అంశం దుమారం రేపుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఈ అంశంపై అనేక ప్రాంతీయ పార్టీలు తమ తమ వైఖరినీ స్పష్టంగా చెబుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు.

తాను ఉన్నానంటూ, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ముస్లింలకు భరోసా కల్పిస్తున్నారు సీఎం జగన్. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒకవైపు ఎన్డీయోలో భాగస్వామిగా ఉంటూ మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నాడని సీఎం జగన్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న ఎన్డీయేతో చంద్రబాబు, పవన్ జతకట్టారని ఆయన తెలిపారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించటం సరైనేదానా? అని సీఎం జగన్  ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో వారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. అంతేకాక ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఆరునూరైనా ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతే కాకుండా, ఎన్ఆర్సీ, కామన్ సివిల్ యాక్ట్ అంశాల్లో మైనార్టీలకు అండగా ఉంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు.  ముస్లిం రిజర్వేషన్ల అంశంపై దుమారం రేపుతున్న సమయంలో సీఎం జగన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అంతేకాక సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలీలో ప్రచారంలో దూసుకెళ్తో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తాను చేయగలిందే చెప్తానంటూ ప్రజలకు తన విశ్వసనీయతను తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్డీయే కూటమి 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను, 2024లో ఇస్తున్న మేనిఫెస్టోను చూపిస్తూ..వారిపై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. మొత్తంగా ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ హామీ ఇవ్వడంతో ఆ వర్గం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నరు. అంతేకాక సీఎం జగన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.