P Krishna
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వికలాంగులుగా మారిపోతున్నారు. నిర్లక్ష్యం, అతి వేగం, డ్రైవింగ్ పై అనుభవం లేకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో పెద్ద దిక్కు కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మారిపోతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు అధికారులు. తాజాగా ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గుడిపాల మండలం గొల్లమడుగు టర్నింగ్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణం చేస్తున్న 22 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు బోల్తా పడగానే అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కి 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు గుడిపాల మండలం-వేలూరు నేషనల్ హైవే వద్ద గొల్లమడుగు టర్నింగ్ వద్ద అదుపు తప్పి ఓ గోడను ఢీ కొట్టి బోల్తా పడింది.
ఈ ఘటనలో సికింద్రాబాద్ కి చెందిన లలిత(65), తమిళనాడుకు చెందిన మాని యంబాడికి చెందిన కుబేరన్ (35) కి తీవ్రంగా గాయాలు అయినట్లు.. మరో 20 మందికి స్వల్పంగా గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు.