Arjun Suravaram
Chintakayala Ayyanna Patrudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీలో కీలకమైన నేతల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తి అధినేత చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Chintakayala Ayyanna Patrudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీలో కీలకమైన నేతల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తి అధినేత చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అన్ని పార్టీల్లో షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముదుకెళ్తుంటే.. టీడీపీ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఆ పార్టీల్లో అసమ్మత్తుల సెగ ఎక్కువగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఇప్పటికే కేశినేని నాని, స్వామిదాస్, రాయపాటి రంగరావు వంటి వారు టీడీపీపై ప్రత్యక్షంగానే తిరుగుబాటు చేసి.. ఆ పార్టీకి రాజీనామా సైతం చేశారు. ఇక పార్టీకి నమ్మిన వ్యక్తులుగా ఉన్న కొందరు నేతలు సైతం అధినేత చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అలాంటి వారిలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నమ్మిన వారిని.. చివరి దాకా నమ్మించి.. చివర్లో మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యా అని చాలా మంది అంటుంటారు. ఆయన కారణంగా ఎంతో మంది రాజకీయంగా అన్యాయం అయిపోయారని వార్తలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా తన విషయంలో చంద్రబాబు ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. తన నియోజవర్గం..తన జిల్లాలో జరిగే టీడీపీ కార్యక్రమాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వట్లేదని అలకగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్ లో కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మూడు నెలల నుంచి అపాయింట్ మెంట్ అడుగుతున్నా చంద్రబాబు ఇవ్వలేదంట.
పార్టీలో అడుగడుగున అవమానిస్తున్నారని అయ్యన్న ఆవేదన చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భారీ బహిరంగ సభలకు అయ్యన్న ముఖం చాటేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తుని బహిరంగ సభకు సైతం అయ్యన్న మొహం చాటేశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తనకు ముందుగా ఇవ్వలేదని ఆయన మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అలానే చంద్రబాబు.. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన చేరిక సమాచారం అయ్యన్నకు ఇవ్వకుండా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే మంగళగిరిలో జరిగిన బీసీ, పంచాయితీ రాజ్ సదస్సులకు సైతం అయ్యన్న దూరంగా ఉన్నారు. తమకు పార్టీలో అడుగడుగునా అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాన్ని అయ్యన్న వ్యక్తం చేస్తున్నట్లు టాక్. పార్టీలో జరుగుతున్న పరిణామాల,అవమానకరణ ఘటనలపై చంద్రబాబుకు వివరించేందుకు అపాయిట్ మెంట్ కోసం చూస్తున్నాడు. అయితే మూడు నెలల నుంచి బాబు అపాయిమెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. ఇలా బీసీలకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదే నా అంటూ ఆయన సన్నిహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.