iDreamPost
android-app
ios-app

భారీగా పెరిగిన చికెన్,గుడ్డు ధరలు..కేజీ చికెన్,గుడ్డు ధర ఎంతంటే..?

  • Published May 21, 2024 | 5:20 PM Updated Updated May 21, 2024 | 5:20 PM

ఈ మధ్య కాలంలో ఎండల తీవ్రత కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌, కోడి గుడ్డు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో కూడా చికెన్‌ ధరతో పాటు కోడిగుడ్డు ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ వివరాలేంటో చూద్దాం.

ఈ మధ్య కాలంలో ఎండల తీవ్రత కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌, కోడి గుడ్డు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో కూడా చికెన్‌ ధరతో పాటు కోడిగుడ్డు ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published May 21, 2024 | 5:20 PMUpdated May 21, 2024 | 5:20 PM
భారీగా పెరిగిన చికెన్,గుడ్డు ధరలు..కేజీ చికెన్,గుడ్డు ధర ఎంతంటే..?

ఈ ఏడాది ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా అధిక  ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడుతున్న కారణంగా.. మార‍్కెట్‌ లో నిత్యవసర వస్తువుల దగ్గర నుంచి కూరగాయల వరకు ఇలా ఏవీ చూసుకున్న ధరలు కొండెక్కుతున్నాయి. దీంతో సామన్యులు అసలు మార్కెట్‌ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా భయపడిపోతున్నారు. ఇకపోతే  మార్కెట్‌ లో  చికెన్‌, కోడిగుడ్డు ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇప‍్పటికే తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌, కోడి గుడ్డు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో కూడా చికెన్‌ ధరతో పాటు కోడిగుడ్డు ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని  చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. కాగా, గత నెలలో  కేజీ చికెన్‌ ధర  రూ. 230 నుంచి 260 వరకు ఉంది. కానీ, గత మూడు వారల నుంచి ఈ చికెన్‌ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రలో కేజీ చికెన్‌ ధర రూ. రూ.300కు చేరింది. ఇక ఈ రేటు మరింత ఎక్కువగా పేరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు చికెన్‌ ధర పాటు కోడిగుడ్ల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. అయితే మార్చిలో వంద కోడి గుడ్ల ధర రూ.425 వరకు ఉంది. ఇక ఏప్రిల్‌ లో వాటి ధర రూ.20 తగ్గి రూ.405కు చేరింది. కాగా, ఇప్పుడు ఉన్నట్టుండి గుడ్ల ధరలు అమాంతంపెరిగాయి. ప్రస్తుతం 100 గుడ్లు రూ.550కి చేరింది.

అయితే డజన్ గుడ్లు రిటైల్ మార్కెట్‌లో చూసుకుంటే.. రూ.72కు చేరింది. ఇటు చికెన్, అటు కోడి గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. గత రెండు నెలలుగా ఎండలు, వేడిగాలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఈ వేడిగాలులకు కోళ్లు భారీగా చనిపోయాయి. దాని ప్రభావమే ఈ చికెన్‌, కోడి గుడ్ల ధరలు పెరగడానకి కారణమని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. అందుకే చికెన్ ధరలు 20 రోజుల్లోనే కేజీకి రూ.40 వరకు పెరిగిందని, అయితే  మరో నాలుగు వారలు ఆగితే కానీ ధరలు తగ్గే పరిస్థితి ఉండదంటున్నారు. మరి, ఆంధ్రలో ఒక్కసారిగా చికెన్‌ ధరలు భారీగా పెరిగిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.