iDreamPost
android-app
ios-app

చంద్రబాబు.. తన అరెస్ట్ విషయంలో ఆ అంచనా వేయలేదు..!

చంద్రబాబు.. తన అరెస్ట్ విషయంలో ఆ అంచనా వేయలేదు..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించిన వార్త.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. స్కిల్ డెవల్మంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. అక్కడ 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఆయన జైలుకెళ్లిన దాఖాలు లేవు. కనీసం అరెస్టు అయిన ఘటనలు కూడా లేవు. అంతలా చంద్రబాబు పరిస్థితిని ముందుగా అంచనా వేసేవారు. అయితే ఈ సారి ఆయన అంచనా తప్పింది. అరెస్ట్ విషయంలో ఆయన అంచనా తప్పినట్లు, సీఐడీ అధికారుల ఆలోచనను అంచన వేయలేకపోయారనే వార్తలు వినిపిస్తోన్నాయి. అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు రోజు అంటే శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు ఆయన బస చేసిన ప్రాంతాన్ని చుట్టు ముట్టారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఐడీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడి వెళ్లారు. అయితే పోలీసులు అక్కడి వస్తున్నారనే సంగతి చంద్రబాబుకు ముందే తెలిసినట్లు టాక్. అయితే ఆయనను పుంగనూరు, అంగళ్లలో జరిగిన అల్లర్ల కేసులో అరెస్ట్ చేసేందుకు వస్తున్నట్లు ఆయన భావించారని తెలుస్తోంది.

ఈ కేసుల్లో ఎలాగైన ఈజీగా బయట పడొచ్చని, అంతేకాక పోలీసులు అరెస్ట్ చేయడంతో సింపతీ పొందొచ్చని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. అయితే అందుకనే పోలీసులు.. చంద్రబాబు బస చేసే ప్రాంతానికి వచ్చే వరకు కూడా.. స్కిల్ డెవల్మెంట్ కేసులో అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలియదు. అయితే అరెస్టుకు గంట ముందు బాబుకు విషయం తెలిసి.. అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడని, అయితే అప్పటికే పోలీసులు అక్కడ చుట్టు ముట్టడంతో బయటకు వెళ్లలేక పోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒకవేళ ముందే తెలిసి.. అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్లి ఉంటే.. అరెస్టు జరిగి ఉండేది కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రామోజీ రావు విషయంలో అదే జరిగిందని, కేవలం అధికారులు అక్కడి వెళ్లగలిగారే కానీ.. ఆయనను అరెస్ట్ చేయలేక పోయారు. పక్క రాష్ట్రంలో ఉంటే.. సొంత రాష్ట్రంలో ఉన్నట్లు ఈజీగా అరెస్టు చేయలేరు. కానీ ఎప్పుడు కచ్చితంగా అంచనా వేసే బాబు.. ఈసారి మాత్రం సరిగ్గా అంచనా వేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. తన అరెస్టు విషయంలో చంద్రబాబు సరిగ్గా అంచన వేయలేదు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి