iDreamPost
android-app
ios-app

చంద్రబాబు చేసిన ఆ మోసాన్ని ఆ పత్రికలు కవర్ చేశాయి: జర్నలిస్ట్ సాయి

చంద్రబాబు చేసిన ఆ మోసాన్ని ఆ పత్రికలు కవర్ చేశాయి: జర్నలిస్ట్ సాయి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లోఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని రాజకీయాలు చాలా చిత్రవిచిత్రంగా మారాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుక పడుతుంది. గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో బాబు చేసిన మోసాలను ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలు ప్రజలకు తెలియకుండా కవర్  చేశాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ఓ రెండు ఛానల్ కవర్ చేశాయని ప్రముఖ జర్నలిస్ట్ సాయి అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఆ మోసాన్ని జర్నలిస్ట్ సాయి చక్కగా విశ్లేషించారు.

సొంతింటి కళ్లకు తూట్లు- లబ్ధిదారుల డబ్బులు తిరిగి ఇవ్వక పాట్లు అంటూ ఓ పత్రికలో ప్రచురించిన  అంశాన్ని సాయి ప్రస్తావించారు. ఇదే కదా చంద్రబాబు చేసిన మోసాన్ని కవర్ చేయడం అంటూ సాయి పేర్కొన్నారు.  ఇంకా “తిరుపతి నగరంలో పేద సొంతింటి కలను సాకారం చేసేందుకు గత ప్రభుత్వం 10 వేలకు పైగా గృహాలను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది.  ఇదే స్పూర్తితో మరో ఐదు వేల ఇళ్లను టిడ్కొకి అప్పగించింది. లబ్ధిదారుల నుంచి వాటా సొమ్ము వసూలు చేసి పనులు చేపట్టింది. పునాదుల దశకు చేరగానే ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణలకు తూట్లు పొడిచింది” అంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని సాయి చదివి నిపించారు. అలానే ఆ కథనానికి సాయి గట్టి కౌంటర్ ఇచ్చారు.

టిడ్కో ఇళ్ల విషయంలో చంద్రబాబు హయాంలో జరిగిన మోసం ఇదే అంటూ సాయి వివరించారు. “చంద్రబాబు హయాంలో 15 వేల ఇళ్లు  కట్టేశారని జనం అనుకుంటారు. 10 వేలకు పైగా టిడ్కో  ఇళ్లు నిర్మించి ప్రజలకు కేటాయించారని ఓ మీడియా ప్రచారం చేస్తోంది. కనీసం ఓ 1000 ఇళ్లు చూపించండి. రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యాయి. వాటిని టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఇవ్వలేదు. టీడీపీ ఎన్నికల ముందు మాత్రమే వాటిని ప్రజలకు ఇచ్చింది.  అంటే కాంగ్రెస్ నిర్మించిన ఇళ్లను, టీడీపీ ప్రభుత్వం నిర్మించినట్లు ఓ మీడియా ప్రచారం చేసింది. స్థానికులకు తెలియదా? ఆమాత్రం ఎవరు కట్టించారో.

ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం 10వేల ఇళ్లను కట్టించలేక పోయింది. అంతేకాక ఇళ్ల కోసం జనం దగ్గర డబ్బులు తీసుకుంది టీడీపీ ప్రభుత్వం. అసలు జనం దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి. జగన్ ఇళ్లు  కట్టించి ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జనం ఎవరు డబ్బు కట్టడం లేదు. కాకపోతే తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వమన్న వారికి మాత్రం 30వేలు ఇవ్వమని అడిగితే… ఓ మీడియా రచ్చ రచ్చ చేసింది.  ఇక్కడ కనీసం ఇళ్లు అయినా ఇస్తున్నారు. టీడీపీ హయాంలో డబ్బులు తీసుకున్నారు కానీ.. ఇళ్లు  ఇవ్వలేదు.. అసలు ఏమి పూర్తి కాలేదు. మరి.. ఆ సమయంలో  జనం దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఏమయ్యాయి.

ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన డబ్బులు, ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము ఏమైపోయింది. ఇది కదా మోసం అంటే. అలా బాబు చేసిన మోసాన్ని కవర్ చేయడానికి ఓ మీడియా గేమ్ ఆడుతోంది. ప్రజల నుంచి తీసుకున్న డబ్బులను టీడీపీ  ప్రభుత్వం “పసుపు-కుంకుమ” కింద ఖర్చు చేసింది. అది కవర్ చేయడానికి జగన్ ప్రభుత్వాన్ని తప్పుగాచిత్రికరించి.. బాబు  గొప్ప అని చెప్పే ప్రయత్నం వలనే ఇక్కడ వైఫల్యం.  గత ప్రభుత్వాన్ని కాపాడుకొస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని  నిలదీసే ప్రయత్నం నిజం సమాధి అయి.. సామాన్యులకు న్యాయం జరగడం లేదు”  అని జర్నలిస్ట్ సాయి చెప్పుకొచ్చారు. మరి.. సాయిగా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.