బుడమేరు ఉగ్రరూపంతో విజయవాడకు తీవ్ర ముప్పు! 20 ఏళ్లలో తొలిసారి..

Heavy Rains, Vijayawada, Budameru, Andhra Pradesh: భారీ వర్షాలకు బుడమేరు పొంది ప్రవహిస్తుండటంతో.. విజయవాడ నగరంలోని కొన్ని కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. వేల మంది ప్రజలు.. ఈ వరదలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Heavy Rains, Vijayawada, Budameru, Andhra Pradesh: భారీ వర్షాలకు బుడమేరు పొంది ప్రవహిస్తుండటంతో.. విజయవాడ నగరంలోని కొన్ని కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. వేల మంది ప్రజలు.. ఈ వరదలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే విజయవాడలోని బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో వరదలు ముంచేస్తున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత మరోసారి విజయవాడ నగరం ముంపుకు గురైంది. బుడమేరు పొంగినప్పుడు.. వరద ముప్పును తప్పించుకునేందుకు 20 ఏళ్ల క్రితం ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు. అయితే.. విజయవాడ నగరం వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గం ఎక్కువ కబ్జా గురి కావడంతో.. ప్రస్తుతం పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యాయి.

ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్‌ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది. బుడమేరు పొంగడంతో.. చాలా కాలనీలు నీట మునిగాయి.. వేల మంది ప్రజలు కనీసం మంచినీళ్ల కూడా దొరకని పరిస్థితి ఉంది. బుడమేరు ఉధృతికి అయోధ్యనగర్‌, ఇందిరా నాయక్‌ కాలనీలు జలమయం అయ్యాయి. ముంపులో సింగ్‌నగర్‌, వాంబే కాలనీ, వైఎస్సార్‌ కాలనీలు ఉన్నాయి.. ఆయా కాలనీల్లోని ఇళ్లలో దాదాపు నాలుగు అడుగుల మేర నీరు చేరింది. ఈ వరదలతో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

వరద నీటిని దారిమళ్లించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. తాము గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి వరదలు చూడలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. బుడమేరు 20 ఏళ్ల క్రితం ఇంత ఉగ్రరూపం దాల్చిందని.. మళ్లి ఇప్పుడే అలాంటి పరిస్థితులు చూస్తున్నాం అంటున్నారు. వరదల్లో చిక్కుకున్న కాలనీ వాసులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

 

Show comments