iDreamPost
android-app
ios-app

తాను మరణిస్తూ.. నలుగురికి జన్మనిచ్చిన తల్లి కథ! కడుపున పుట్టింది ఒక్కరే!

ఓ మహిళ తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంది.. ముద్దులొలికే ఆ రూపం చూసుకోవాలని పరితపించింది.. అయితే విధి ఆటలో ఆమె కలలు కల్లలయ్యాయి.

ఓ మహిళ తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంది.. ముద్దులొలికే ఆ రూపం చూసుకోవాలని పరితపించింది.. అయితే విధి ఆటలో ఆమె కలలు కల్లలయ్యాయి.

తాను మరణిస్తూ.. నలుగురికి జన్మనిచ్చిన తల్లి కథ! కడుపున పుట్టింది ఒక్కరే!

ప్రతి ఒక్కరికి జీవితంపై అనేక ఆశలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు కాబోయే భర్త, ఆ తరువాత పిల్లలపై ఎన్నో కోరికలు ఉంటాయి. ఇక అలానే కొత్తగా పెళ్లైన మహిళలు..తమకు పుట్టబోయే బిడ్డకు గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలానే ఓ గర్భిణీ కూడా పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంది. ముద్దులొలికే ఆ బుజ్జాయి రూపం చూసుకోవాలని పరితపించింది. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఓ వ్యక్తి చేసిన తప్పుకు..ఆ వివాహిత బలైంది. అయితే ప్రాణం పోతూ కూడా ముగ్గురి పునర్జన్మనిచ్చింది. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనపురానికి చెందిన మద్దికట్ల సునీత(27), ప్రహ్లాద్ రెడ్డి భార్యాభర్తలు. ఇక సునీత భర్త చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఏడేళ్ల బాబు ఉండగా..సునీత మళ్లీ గర్భిణీగా ఉంది. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణీ కావడంతో జూన్ 8న భర్త ఆమెను బైక్ పై వైద్య పరీక్షల కోసం నంద్యాలకు తీసుకెళ్లాడు. ఇక ఇద్దరు ఎంతో సంతోషంగా తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఊహించుకుంటూ సంతోషంగా ఉన్నారు. నంద్యాలలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం బైక్ పై తిరిగి తన ఊరికి బయలు దేరారు. ఇలా తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆటో రూపంలో మృత్యువు వెంటాడింది.

సునీత దంపతులు వెళ్తున్న బైక్ ను ఆటో ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బైక పై నుంచి సునీత కింద పడిపోయి..తీవ్రంగా గాయలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కడుపులో ఉన్న పాపకు ప్రాణం పోశారు. ఆమెకు ఎమర్జెన్సీ విభాగంలో ఉంచి చికిత్స అందించారు. దాదాపు పది రోజుల పాటు వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధరించారు. ఇక సునీత విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ వైద్య బృందం ఆమె భర్త ప్రహ్లాద్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు కలిశారు.

అంతేకాక అవయవదానంపై వారికి అవగాహన కల్పించారు. తమ బిడ్డ మరికొందరికి పునర్జన్మ ఇస్తుంటే.. ఇంకేమికావాలంటే.. అంతటి దుఃఖంలో కూడా అవయవ దానాన్నికి అంగీకరించారు. దీంతో సునీత నుంచి కాలేయం, రెండు కిడ్నీలు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు రోగులకు అమర్చినట్లు జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి స్వర్ణలత తెలిపారు. ఇలా సునీత తాను ప్రాణాలు పోతు మరో ముగ్గురికి పునర్జన్మనిచ్చింది. మొత్తంగా ఒక బిడ్డకు జన్మనివ్వడంతో పాటు మరో ముగ్గురి పునర్జన్మిచ్చింది. మొత్తంగా అవయవదానాలు పొందిన వారి కుటుంబ సభ్యులు..సునీత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.