P Krishna
Big Alert for People of AP: ఏపీలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.. ఫిబ్రవరి నెల నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.. ఉదయం పూట 9 గంటలకు బయలకు రావాంటే భయపడే పరిస్థితి నెలకొంది.
Big Alert for People of AP: ఏపీలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.. ఫిబ్రవరి నెల నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.. ఉదయం పూట 9 గంటలకు బయలకు రావాంటే భయపడే పరిస్థితి నెలకొంది.
P Krishna
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఫిబ్రవరి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో వాతావరణం పరిస్థితుల్లో మార్పులు సంభవించాయి.. ఇక్కడ ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చిలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని డిజాస్టర్ మేనేజ్ మెంట్ హెచ్చరిస్తుంది. సాధారణ కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏప్రిల్, మేలో ఎండ తీవ్రత మరిత పెరిగే అవకాశం ఉందని.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలుపుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వివరాల్లోకి వెళితే..
ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుంతో తెలియదు. ఈ మద్య కాలంలో ఏ సీజన్ ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎండాకాలంలో వానలు.. వానా కాలంలో ఎండలు. ఏపీలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఎల్‌నినో ప్రభావంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశం ఉందని.. వడగాల్పులు ప్రభావం భారీగా చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ మేరకు భారత వాతావరణ సంస్థ హెచ్చరించిందని.. వడదెబ్బల భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఒక ప్రకటనలో సూచించారు. ఎండల ప్రభావం ఎక్కువగా అనంతపురం, కర్నూల్, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ఉంటుందన్నారు.
విశాఖపట్నం, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్సు ఉందని.. ప్రజలు ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రాణ నష్టం నివారించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు, గర్బిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. మజ్జిక, ఓఆర్ఎస్, మంచినీరు, లెమన్ వాటర్, కొబ్బరి బోండాలు చలువ చేసే పదర్ధాలు సేవించేడం మంచిదని సూచిస్తున్నారు. ఎండలతో పాటు క్యుములో నింబస్ మేఘాల వల్ల అకస్మాత్తుగా వర్షాలు సైతం పడే అవకాశం ఉందని కూర్మనాథ్ తెలిపారు.