తిరుమల వచ్చే భక్తులకు TTD అలెర్ట్! పులుల బారిన ఎవ్వరూ పడకుండా!

Tirumala TTD Big Alert for Devotees: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజూ భక్తులు లక్షల సంఖ్యల్లో తరలివెళ్తుంటారు.ప్రతి నిత్యం తిరుమల సన్నిధిలో గోవిందా.. గోవిందా నామస్మరణతో మారుమోగుతుంది.ఇటీవల ఈ పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద చిరుతలు కలకలం రేపుతున్నాయి.

Tirumala TTD Big Alert for Devotees: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజూ భక్తులు లక్షల సంఖ్యల్లో తరలివెళ్తుంటారు.ప్రతి నిత్యం తిరుమల సన్నిధిలో గోవిందా.. గోవిందా నామస్మరణతో మారుమోగుతుంది.ఇటీవల ఈ పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద చిరుతలు కలకలం రేపుతున్నాయి.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలమంది భక్తులు తరలి వస్తుంటారు. చాలా మంది భక్తులు  అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో కొండ మెట్లు ఎక్కుతూ వస్తుంటారు. అధికారలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా..  కీకారణ్యంలో కాలినడకన వచ్చే భక్తులపై తరుచూ చిరుత, ఎలుగు బంట్లు దాడులు చేసి చంపేస్తున్నాయి. గతంలో తిరుమల కాలినడక మార్గంలో లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో చనిపోయింది. మరో బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.  వణ్యప్రాణుల దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇకపై నిబంధనలు భక్తులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనకం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. చాలా రోజుల తర్వాత ఘాట్ రోడ్లలో ఆంక్షలు విధించింది. ఆదివారం తిరుపతి ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత యధేచ్చగా తిరుగుతూ భక్తుల కంట పడటంతో వెంటనే వారు అటవీ అధికారులు, టీటీడీ కి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అటవీశాఖ అధికారుల సూచనల మేరకు టీటీడీ ఘాట్ రోడ్లపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉంటుంది. తరుచూ ఘాట్ రోడ్లపై సంచరిస్తుంటాయి. మనుషులను చూస్తే దాడులు చేస్తుంటాయి.

చిరుతల సంచానం దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్లపై బైకులకు అనుమతి ఇస్తారు. సెప్టెంబర్ 30 వరకు తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు అమల్లో ఉంటాయని టీటీడీ తెలిసింది. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గతంలో జరిగిన పలు ఘటనలను దృష్టిలో ఉంచుకొని భక్తుల భద్రత నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే చిరుతను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించామని.. ఈ మార్పులను గమనించి తమకు సహకరించాలని అటవీ శాఖ, టీటీడీ అధికారులు భక్తులను కోరుతున్నారు.

Show comments