iDreamPost
android-app
ios-app

వీడియో: నడి రోడ్డుపై ప్రదక్షిణలు చేస్తున్న ఎలుగుబంటి.. ఎందుకంటే?

వీడియో: నడి రోడ్డుపై ప్రదక్షిణలు చేస్తున్న ఎలుగుబంటి.. ఎందుకంటే?

సోషల్ మీడియా వాడకం పెరిగిన తరువాత ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగిన కూడ క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇక ఈ సోషల్ మీడియాలో వచ్చి వాటిల్లో మూగ జీవాలకు సంబంధించిన ఆకట్టుకుంటున్నాయి. ఇక జంతువులు కూడా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికి తెలియదు. కుక్కలు, కోతులు, ఆవులు వంటివి అప్పటి వరకు కూల్ గా ఉండి.. ఒక్కసారిగా వైలెంట్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. అలానే  దేవుడి గుడి ముందు ప్రదక్షిణాలు చేయడం వంటివి మూగజీవాలు చేస్తుంటాయి. తాజాగా ఓ  ఎలుగు బంటి కూడ వింతగా ప్రవర్తించింది. రోడ్డుపై  ప్రదక్షిణాలు చేస్తూ కాసేపు సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెద్ద లోహరిబంద  అనే గ్రామం సమీపంలో రోడ్డుపైకి ఓ ఎలుగుబట్టి వచ్చింది.  రోడ్డు పక్కన ప్రదక్షిణలు చేస్తూ ఆ ఎలుగుబంటి వింతగా ప్రవర్తించింది. లోహరిబంద గ్రామ శివారులోని రోడ్డు పక్కన ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా ఎలుగు బంటి చుట్టూ గిర గిరా తిరుగుతూ కనిపించింది. అటుగా బైక్ పైన వెళ్తున్న ఓ వ్యక్తి అదిచూసి భయంతో గ్రామంలోకి పరుగులు పెట్టాడు. అలానే అటుగా వెళ్తున్న వాహదారులు తొలుత ఆ ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురయ్యారు. అంతేకాక ఎలుగుబంటి విషయం స్థానికులకు తెలియడంతో.. పెద్ద ఎత్తున అక్కడి చేరుకున్నారు. ఎలుగుబంటి చేస్తున్న వింత ప్రవర్తనను చూసి.. అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అంతేకాక ఎలుగు బంటి వింత చేష్టాలను స్థానికులు తమ కెమెరాల్లో రికార్డు చేశారు. రోజూ పొలాలకు వెళ్లే రైతులకు, జీడి తోటల్లో పనులు చేసుకునే కూలీలకు ఎలుగుబంట్లు కనిపించడం సర్వసాధారణ అయింది. కొన్ని సందర్భాల్లో ఎలుగుబంట్లు కూలీ పనులు చేసుకుంటున్న వారిపై  దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మందస మండలం పెద్ద లోహరిబందలో ఎలుగుబంటి ఇలా వింతగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారతి కన్నీటి కష్టాలు.. చదువుకుంటుంటే కొట్టుకుంటూ తీసుకొచ్చారు!