iDreamPost
android-app
ios-app

బాలయ్యకి కూడా Jr.NTR అంటే భయామా? అల్లుడి కోసమే?

బాలయ్యకి కూడా Jr.NTR అంటే భయామా? అల్లుడి కోసమే?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు స్పందించారు. టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఎన్టీఆర్ స్పందించకపోతే ఏమీ.. ఐ డోంట్ కేర్ బ్రో అంటూ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అల్లుడి కోసం అన్న కొడుకునే బలి చేస్తావా? ఎన్టీఆర్ అంటే అంత భయమా? బాలయ్యా అంటూ ఫైర్ అవుతున్నారు.

స్వయం కృషితో తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఏకైక హీరో కూడా తారక్ నే. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ టీడీపీలోని కొందరు విమర్శిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించరు, తాత పెట్టిన పార్టీ ఇబ్బందుల్లో ఉంటే, మామను అరెస్ట్ చేస్తే స్పందించకపోవడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే బాలకృష్ణ కూడా అదే ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. ఐ డోంట్ కేర్.. బ్రో.. ఐ డోంట్ కేర్ అంటూ సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. అల్లుడి కోసం బావతో కలిసి అన్న కొడుకుని ఎన్ని ఇబ్బందులకు గురి చేశావో గుర్తులేదా? బాలయ్య అంటూ ప్రశ్నిస్తున్నారు. తన రాజకీయం కోసం ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసని దుయ్యబడుతున్నారు. 2009 టీడీపీ తరపున ఎన్టీఆర్ ను ప్రచారం చేయించుకుని.. చివరకు అతడిపైనే నెగిటీవిగా ప్రచారం చేసిన విషయాన్ని ఎలా మర్చిపోతామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అల్లుడికి దొడ్డి దారిలో మంత్రి పదవి ఇచ్చారే కానీ ఆ సమయంలో ఈ ఎన్టీఆర్ గుర్తుకు రాలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. తన అల్లుడికి నష్టం జరుగుతుందని భావించి.. బావ చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ ను తొక్కేయలేదా బాలకృష్ణ అంటూ తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇటీవలే జరిగిన విశ్వనటుడు స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదు. అలానే ఎన్టీఆర్ పేరిట రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి తారక్ ను ఆహ్వానించలేదు. ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం తారక్ గుర్తుకు రాడు కానీ.. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆయన స్పందించాలని గగ్గోలు పెడుతుంటారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ పగ్గాలు చేపడతాడో అనే భయం బాబు, బాలయ్యల్లో ఉందని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. అందుకే ఎన్టీఆర్ అంటే భయపడే..ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş