iDreamPost
android-app
ios-app

Jr.NTR స్పందించకపోతే ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Jr.NTR స్పందించకపోతే ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు స్పందించారు. అలానే సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కూడా చంద్రబాబు అరెస్ట్ పై  స్పందించారు. టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ అంశంమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ స్పందించకపోతే ఏమీ.. ఐ డోంట్ కేర్ అంటూ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

బుధవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ కార్యకర్తలతో  నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. తెలంగాణలో టీడీపీ  అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా  బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారని అన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తుందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ రంగానికి సంబంధించిన పెద్దలెవరూ స్పందించకపోవడంపై  విలేఖరులు ప్రశ్నించారు.

ఎవరు స్పందించకపోయినా తాను పట్టించుకోనని బాలకృష్ణ స్పష్టం చేశారు. అలానే ఇది సినిమా రంగానికి సంబంధించిన విషయం కాదనడం కూడా తప్పేని అన్నారు. చంద్రబాబు నిజాయితీ గురించి అందరికీ తెలుసని బాలయ్య అన్నారు. రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారన్నారని, రిమాండ్ లోకి తీసుకున్నా తరువాత సెక్షన్లు చెబుతున్నారన్నారని బాలకృష్ణ మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై విలేఖరులు బాలకృష్ణను ప్రశ్నించగా.. ఐ డోంట్ కేర్… బ్రో.. ఐ డోంట్ కేర్ అంటూ ఘాటుగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ పై  బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. మరి.. బాలయ్య వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet