Nidhan
కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరనున్నాడు. ఈ తరుణంలో కొందరు ఆలయ ప్రారంభానికి ఇంత ఆర్భాటం ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై పద్మ శ్రీ గరికిపాటి నరసింహారావు సీరియస్ అయ్యారు.
కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరనున్నాడు. ఈ తరుణంలో కొందరు ఆలయ ప్రారంభానికి ఇంత ఆర్భాటం ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై పద్మ శ్రీ గరికిపాటి నరసింహారావు సీరియస్ అయ్యారు.
Nidhan
అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బాల రాముడు సోమవారం కొలువు దీరనున్నాడు. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా చూస్తుండగా.. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టించనున్నారు. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. రామ మందిరాన్ని పూలతో, లైట్లతో అలంకరించారు. వందల ఏళ్ల తర్వాత రామాలయం ప్రారంభం కానుండటంతో కోట్లాది మంది భక్తులు సంతోషంలో మునిగిపోయారు. అత్యంత వైభవంగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం విశేషం. అయితే కొందరు మాత్రం రామాలయ ప్రారంభానికి ఇంత హడావుడి, ఆర్భాటాలు అవసరమా అని వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి వారికి మహా సహస్రావధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికిపాటి నరసింహ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మళ్లీ నోరెత్తకుండా రాముడు ఏంటి? రామాలయానికి ఆర్భాటం ఎందుకు అవసరమో స్పష్టంగా విడమరిచి చెప్పారు.
భవ్య రామ మందిరం కోసం ఆర్భాటాలు అవసరమా అనేవారికి గరికిపాటి నరసింహారావు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. రాముడికి ఆర్భాటాలు అవసరమేనని.. ఆయన రాజు అని అన్నారు. ‘రాముడి గుడికి అంత ఆర్భాటం ఎందుకని కొంతమంది అంటున్నారు. మామూలుగా చేయొచ్చు కదా అని చెబుతున్నారు. కానీ అలా చేయకూడదు. శివుడికి, కృష్ణుడికి మామూలుగా చేయొచ్చు.. కానీ రాముడికి కుదరదు. శివుడు త్యాగి, కృష్ణుడు యోగి.. కానీ రాముడు భోగి. ఆయన రాజు. మామూలు ముఖ్యమంత్రి వెళ్తే వెనుక పది కార్లు, ముందు పది కార్లు వెళ్తున్నాయి. అదే మహారాజు వెళ్తే ఎలా ఉంటుంది? ఆర్భాటాలు అంటూ మాట్లాడితే ఎలా?’ అని గరికిపాటి ఎదురు ప్రశ్నించారు. అయోధ్యలో ప్రతిష్టిస్తోంది బాల రాముడ్ని అని.. పెళ్లి కాని రాముడ్ని అని చెప్పారు. ఆయన ఓ వీరత్వంతో స్ఫూర్తిగా నిలబడ్డాడని తెలిపారు. రాముడు అంటే ధనుష్కుడు అని.. అలాంటి యోధుడు మళ్లీ భారత యుగంలో అర్జునుడేనని గరికిపాటి పేర్కొన్నారు.
కాగా, భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను కనులారా చూసేందుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది అయోధ్యకు తరలి వస్తున్నారు. ఇందులో 7 వేల మంది వీఐపీలు, స్వామీజీలు పాల్గొననున్నారు. ఆలయ ప్రారంభోత్సవం కావడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సోమవారం సెలవు ప్రకటించాయి. ఒడిశాలోనూ సెలవు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ఒక పూట సెలవు ఇచ్చారు. ఇవాళ బ్యాంకులతో పాటు ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఒక పూట సెలవును ప్రకటించారు. ఈ రోజు స్టాక్ మార్కెట్లు పని చేయవు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి భారీగా కానుకలు వస్తున్నాయి. కన్నౌజ్ నుంచి పరిమళాలు, అమరావతి నుంచి 5 క్వింటాళ్ల పసుపు, ఢిల్లీ నుంచి నవ ధాన్యాలు, భోపాల్ నుంచి పువ్వులు అయోధ్యకు వచ్చాయి. మరి.. అయోధ్య ఆలయానికి ఇంత ఆర్భాటం దేనికంటూ విమర్శలు చేస్తున్న వారికి గరికిపాటి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.