iDreamPost
android-app
ios-app

CM జగన్ పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

Attack On CM Jagan Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పక్కా ఆధారాలతో దాడి చేసిన వ్యక్తిని, ప్రోత్సహించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

Attack On CM Jagan Case: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పక్కా ఆధారాలతో దాడి చేసిన వ్యక్తిని, ప్రోత్సహించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

CM జగన్ పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయితో జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను హత్య చేసే ఉద్దేశంతోనే పదునైన రాయితో దాడికి పాల్పడినట్లు పోలీసులు రిపోర్ట్ లో వెల్లడించారు. అయితే ఒకసారి దాడి చేయగా విఫలం కావడంతో మరోసారి దాడి చేసినట్లు వెల్లడించారు. దాడి చేసిన సమయంలో స్థానికులు పట్టుకోగా సతీశ్ తప్పించుకుని పారిపోయినట్లు తెలియజేశారు. ఈ మొత్తం పథకంలో ఏ2 దుర్గారావు సూత్రధారి అంటూ పోలీసులు వెల్లడించారు.

సీఎం జగన్ పై దాడి కేసులో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను బహిర్గతం అయ్యాయి. అసలు దాడి ఎలా చేశారు? ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరు చేశారు? ఇలా అన్ని విషయాలను పోలీసులు స్పష్టం చేస్తూ ఒక రిపోర్టును కోర్టుకు అందజేశారు. పోలీసుల రిపోర్టు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయితో దాడికి దిగిన సతీశ్ డాబా కోట్ల సెంటర్ లో దాడి చేశాడు. తొలి ప్రయత్నంలో సతీశ్ విఫలమయ్యాడు. ఆ తర్వాత 100 మీటర్ల దూరం వచ్చి వివేకానంద స్కూల్ ప్రహరీకి ఆనుకుని ఉన్న బెంచ్ దగ్గర నుంచి రెండోసారి దాడి చేశాడు. అక్కడ కొందరు యువకులు నిల్చోని ఉండగా.. వారి వెనుక నుంచి సతీశ్ రాయితో దాడి చేశాడు.

CM jagan

సీఎం జగన్ ని హత్య చేసే ఉద్దేశంతోనే పదునైన కాంక్రీట్ కంకర రాయితో కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి మొత్తం వెనుక ఉన్న మాస్టర్ మైండి ఏ2 దుర్గారావుగా పోలీసులు నిర్ధారించారు. దాడి చేసింది సతీశ్ అయినా కూడా ప్రోత్సహించింది, డబ్బు ఆశ చూపింది మాత్రం టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా ఉన్న దుర్గారావు అని నిర్ధారణకు వచ్చారు. డబ్బులిస్తానని సతీశ్ కి చెప్పిన దుర్గారావు ఈ దాడి చేయించినట్లు స్పష్టం చేశారు. దాడి చేసిన తర్వాత డబ్బు కోసం సతీశ్ ఏ2 దుర్గారావుకు కాల్ చేశాడు.

సతీశ్ ఫోన్ చేసినప్పుడు దుర్గారావు మొదట లిప్ట్ చేసి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సతీశ్ కి సంబంధించి క్రైమ్ హిస్టరీ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సతీశ్ రెండేళ్ల క్రితం సెల్ ఫోన్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. సింగ్ నగర్ దగ్గరున్న కాంక్రీట్ రాళ్లను జేబులో వేసుకుని వచ్చి సతీశ్ ఈ దాడి చేశాడు. టీడీపీ బీసీ సెల్ కార్యదర్శి దుర్గారావును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు ఎందుకు దాడి చేయించాడు అనేది కీలక అంశంగా మారింది. కేసులో పరోగతిని బట్టి శుక్రవారం దుర్గారావును పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.