iDreamPost

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A-14లోకేశ్.. అరెస్టు తప్పదా..?

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A-14లోకేశ్.. అరెస్టు తప్పదా..?

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన మెమోలను సీఐడీ.. ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో సీఐడీ నారా లోకేశ్ పేరును చేర్చింది. సీఐడీ దాఖలు చేసిన మెమోలో A14 నారా లోకేష్ ను పేర్చారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి నారా లోకేష్ పేరును కూడా చేర్చారు సీఐడీ అధికారులు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో మార్పులు చేసి లబ్ది పొందాలని ప్రయత్నించారని ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసింది. అమరావతి ప్రాంతంలో నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో మార్పులు చేర్పులు చేశారని, వాటి ద్వారా హెరిటేజ్, పి. నారాయణ, లింగమనేని రమేష్ ఆస్తుల విలువ పెంచుకునే ప్రయత్నం చేశారని సీఐడీ ఆరోపిస్తుంది.

హెరిటేజ్ భూములకు దగ్గరగా వెళ్లేందుకు  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను సౌత్ సైట్  దగ్గరగా వెళ్లేందుకు  ప్లాన్ మార్చారని, అలానే విజయవాడలో మాజీ మంత్రి నారాయణ భూములు  ఇన్నర్ రింగ్ రోడ్డులో పొకుండా ఉండేందుకు ఉత్తరంగా మార్పు చేశారని అభియోగాలు ఉన్నాయి. మొత్తం 94 కిలోమీటర్ల  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ నిర్మాణ బాధ్యతలను సింగపూర్ కు చెందిన కన్సల్టెన్సీకి  అప్పగించి.. మళ్లీ తాము చెప్పినట్లుగానే  రింగ్ రోడ్డు  ప్లాన్ నిర్ధారణ చేయాలని షరతులు పెట్టినట్లు  సీఐడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అంశంపై ఏసీబీ  కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. మరి.. ఈ కేసులో A14గా ఉన్న నారా లోకేశ్ కూడా అరెస్ట్ అవుతాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తోన్నాయి.  మరి..ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేశ్ పేరు ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి