iDreamPost
android-app
ios-app

కూలి పనులు చేస్తూ.. పట్టుదలతో చదివి.. టెన్త్‌లో 509 మార్కులు సాధించిన విద్యార్థిని

పదో తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థిని మెరిసింది. కుటుంబానికి సహాయంగా కూలి పనులు చేేస్తూ పట్టుదలతో చదివి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 600కు 509 మార్కులు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది.

పదో తరగతి ఫలితాల్లో ఓ విద్యార్థిని మెరిసింది. కుటుంబానికి సహాయంగా కూలి పనులు చేేస్తూ పట్టుదలతో చదివి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 600కు 509 మార్కులు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది.

కూలి పనులు చేస్తూ.. పట్టుదలతో చదివి.. టెన్త్‌లో 509 మార్కులు సాధించిన విద్యార్థిని

సంకల్ప బలముంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు పలువురు విద్యార్థులు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకుండా శ్రద్ధతో చదువుకుని మంచి ఫలితాలను పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో మట్టిలో మాణిక్యాలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. టెన్త్ పరీక్ష ఫలితాల్లో రికార్డు స్థాయి మార్కులు తెచ్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కూలి పనులకు వెళ్తూ పదోతరగతి చదివింది. వారంలో మూడు రోజులు కూలికి.. మూడు రోజులు స్కూల్ కి వెళ్తూ చదువుకుని టెన్త్‌లో 509 మార్కులు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది.

చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఆ విద్యార్థిని. చదువుకుంటేనే లైఫ్ మారుతుందని భావించింది. కష్టాలను ఎదిరించి చదువును కొనసాగించింది. కూలి పనులు చేస్తూ పట్టుదలతో చదివి టెన్త్ లో 600 మార్కులకు 509 మార్కులు సాధించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఆ విద్యార్థిని మరెవరో కాదు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన. బోయ ఆంజనేయులు, వన్నూరమ్మల కుమార్తె బోయ నవీన. కాగా వీరిది పేద కుటుంబం. కూలి పనులు చేస్తే తప్పా పూటగడవని పరిస్థితి. తండ్రి వ్యవసాయ కూలీ. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.

కుటుంబ పరిస్థితిని గమనించిన నవీన అండగా ఉండేందుకు సిద్ధమైంది. అందుకోసం కూలి పనులకు వెళ్లేందుకు సైతం వెనకాడలేదు. నవీన వారంలో మూడు రోజులు కూలి పనులకు వెళ్తూ.. మూడు రోజులే పాఠశాలకు వెళ్లేది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికకు చదువుపై ఉన్న శ్రద్ధను చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఆమె చదువుకునేందుకు కావాల్సిన సహాయం అందించారు. ఈ క్రమంలో నవీన పదో తరగతిలో కష్టపడి చదివి అసాధారణ ప్రతిభ కనబర్చింది. సోమవారం విడుదలైన పదో తరగతిలో ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా అత్యధిక మార్కులు సాధించి అందరి మన్ననలను అందుకుంది.ల