చంద్రబాబు అరెస్ట్ అయితే మాకేంటి? ఏపీ ప్రజల తెలివికి హ్యాట్సాఫ్!

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడిన కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన అనంతరం ఆయనను తాడేపల్లి లోని సిట్ కార్యాలయానికి రోడ్డు మార్గంలో తరలించారు. సిట్ కార్యాలయంలో అధికారులు స్కిల్ స్కామ్ కు సంబంధించి చంద్రబాబును కొన్ని గంటల పాటు విచారించారు. విచారణలో కీలక విషయాలను రాబట్టారు. స్కిల్ స్కామ్ కు ప్రధాన సూత్రదారి చంద్రబాబే అని ఆయన బలవంతంతోనే నిధులు విడుదల చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు సిట్ అధికారులు. అయితే ఈ వ్యవహారంపై ఏపీ ప్రజల ఆలోచన తప్పు చేసే నేతలకు చెంపపెట్టులా మారింది. తప్పు చేసిన నాయకులకు మద్దతు ఇవ్వకుండా ప్రజలు వారి విజ్ఞతను చాటుకుంటున్నారు.

చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతందని ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని ఆశించిన టీడీపీ నాయకులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఏపీ ప్రజలు. అసలు ఏమీ పట్టనట్టుగా ఉండడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు టీడీపీ శ్రేణులు. దీంతో అసహనానికి గురైన కొంతమంది టీడీపీ నాయకులు జనసమీకరణ చేయాలని, అల్లర్లు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు మాత్రం విచక్షణతో ఆలోచిస్తున్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన బాబుకు మద్దతివ్వబోమంటూ తేల్చి చెప్పుతున్నారు. చంద్రబాబు అరెస్టు అయితే మాకేంటి అన్నట్లుగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. దీంతో అరెస్టులతో ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని ఆశపడ్డ టీడీపీకి కర్రుకాల్చి వాత పెట్టారు ఏపీ ప్రజలు. ప్రజాధనాన్ని లూటీ చేసి నష్టపరిచిన బాబుకు గూబగుయ్యిమనేలా దెబ్బకొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

Show comments