iDreamPost
android-app
ios-app

చంద్రబాబు బెయిల్‌ కండీషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

  • Published Nov 03, 2023 | 12:02 PM Updated Updated Nov 03, 2023 | 12:02 PM

చంద్రబాబు నాయుడికి జారీ చేసిన మధ్యంతర బెయిల్‌పై మరికొన్ని షరతులను విధించాలని కోరుతూ.. సీఐడీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

చంద్రబాబు నాయుడికి జారీ చేసిన మధ్యంతర బెయిల్‌పై మరికొన్ని షరతులను విధించాలని కోరుతూ.. సీఐడీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Nov 03, 2023 | 12:02 PMUpdated Nov 03, 2023 | 12:02 PM
చంద్రబాబు బెయిల్‌ కండీషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో 52 రోజులు గడిపారు. ఇక నాలుగు రోజుల క్రితమే ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు.. చంద్రబాబు నాయడికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు బెయిల్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు అనేక కండీషన్లు పెట్టింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వీటిలో కొన్ని ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. దాంతో ఏపీ సీఐడీ.. హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం గురువారం తన తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు ఎలాంటి రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. స్కిల్‌ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడొద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగించాలని న్యాయస్థానం పేర్కొంది. చంద్రబాబు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు సీఐడీ డీఎస్పీలను నియమించాలన్న సీఐడీ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు మంగళవారం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో పాటుగా కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని కోరుతూ.. చంద్రబాబు తరఫు లాయర్లు.. రెగ్యులర్ బెయిల్‌కు అనుబంధంగా మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాలుగు వారాల పాటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెల్లడించింది.