iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో నటుడు మృతి!

CID Show Actor: సినీ, రాజకీయా రంగాల్లో తరచూ విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖలు వివిధ కారణాలతో మృతి చెందారు. తాజాగా మరో నటుడు మృతితో ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.

CID Show Actor: సినీ, రాజకీయా రంగాల్లో తరచూ విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖలు వివిధ కారణాలతో మృతి చెందారు. తాజాగా మరో నటుడు మృతితో ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.

ఇండస్ట్రీలో విషాదం.. అనారోగ్యంతో నటుడు మృతి!

సినీ ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక విషాదం చోటుచేసుకుంది. సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు మృతి చెందారు. ఇటీవలే సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్య కారణంగా కన్నుమూశారు. ఇలా ప్రముఖల మృతితో వారి కుటుంబాలతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. గుండెపోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు వంటి కారణాలతో మరణిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. పాపులర్ టీవీ షో సీఐడీతో గుర్తింపు పొందిన నటుడు దినేశ్ ఫడ్నిస్(57)మృతి చెందారు. గత కొంతకాలం అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు.

పాపులర్ టీవీ షో సీఐడీ గురించి అందరికి తెలిసిందే. ప్రతి రోజు ఈ షోలో ఇంట్రస్టింగ్ కేసులతో సీఐడీ అధికారులు మన ముందుకు వస్తుంటారు. ఈ షో తొలుత బాలీవుడ్ లో రాగా.. ఆ తరువాత తెలుగు కూడా డబ్ అయ్యే మంచి గుర్తింపు పొందింది. అందులోనూ నటులకు మంచి గుర్తింపు లభించింది.  అలాంటి వారిలో దినేశ్ ఫడ్నిస్ ఒకరు. ఆయన  సీఐడీ షోలో ప్రత్యేక పాత్రను పోషించారు.

ఆయన మంగళవారం ఉదయం అనారోగ్యం కారణంగా మరణించారు. లివర్ తో పాటు పలు అవయవాలు దెబ్బతినడంతో ఆయన ఇటీవల ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ దినేశ్ మరణించారు. ఇదే విషయాన్ని దినేశ్ సహచర నటుడు దయానంద్ ప్రకటించారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. సుమారు 20 ఏళ్ల పాటు సీఐడీ సీరియల్ లో నటించిన దినేశ్.. ప్రణీత్ పాత్రలో అలరించారు.

టైమ్స్ నివేదిక ప్రకారం దినేశ్ సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తుది శ్వాస విడిచారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. డిసెంబరు 2 నుండి దినేష్ ఫడ్నిస్  ఐసీయూలో ఉన్నారని, గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారని అనేక మీడియా నివేదికలు సూచించాయి. అయితే ఫడ్నిస్ కు గుండె పోటు రాలేదని ఆయన సహర నటుడు దయానంద్ శెట్టి స్పష్టం చేశారు. ప్రముఖ డిటెక్టివ్ షో సీఐడీ 1998లో టెలివిజన్‌లో ప్రసారం చేయడం ప్రారంభించింది. 2018 వరకు కూడా అద్భుతమైన రన్‌ను కలిగి  అందరిని ఆకట్టుకుంది.

ఈ షోలో దినేష్ ఫ్రెడరిక్స్ పాత్రను పోషించాడు. ఈ  షో ముగిసిన తర్వాత తన అభిమానులతో సంభాషించడానికి దినేష్ యాక్టివ్ సోషల్ మీడియా ఖాతాను నిర్వహించాడు. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకునేవాడు. తాజాగా ఆయన మృతితో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. దినేశ్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.