iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: చంద్రబాబుపై హైకోర్టుకు ఫిర్యాదు చేసే యోచనలో CID ?

అయితే బెయిల్‌ మంజూరు సందర్భంగా కోర్టు పలు కండిషన్లు పెట్టింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు చేశామని కోర్టు వెల్లడించింది. ఆయన కేసుని ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.

అయితే బెయిల్‌ మంజూరు సందర్భంగా కోర్టు పలు కండిషన్లు పెట్టింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు చేశామని కోర్టు వెల్లడించింది. ఆయన కేసుని ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.

బ్రేకింగ్: చంద్రబాబుపై హైకోర్టుకు ఫిర్యాదు చేసే యోచనలో CID ?

ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఈ కేసుతో పాటు పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు బెయిల్ వచ్చేందుకు బాబు లాయర్లు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టులో బాబుకు భారీ ఊరట లభించింది. 52 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడికి.. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు అనగా నవంబర్ 24 వరకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం తీర్పును వెల్లడించారు. కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని.. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

అయితే బెయిల్‌ మంజూరు సందర్భంగా కోర్టు పలు కండిషన్లు పెట్టింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి బెయిల్‌ మంజూరు చేశామని కోర్టు వెల్లడించింది. ఆయన కేసుని ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని తెలిపింది. ఆస్పత్రికి, ఇంటికి మాత్రమే పరిమితం కావాలని ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దవుతుందని తెలిపింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చారు.

కాగా జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్దంగా జైలు గేటు వరకు కార్యకర్తలు తోసుకు వచ్చి స్వాగతం పలికారు. ర్యాలీగా రాకూడదని షరతులు ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణుల సమూహంతో రోడ్డుపైకి వచ్చారు బాబు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా బాబు మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విధించిన షరతులను తుంగలో తొక్కారు బాబు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీఐడీ ఉన్నట్లు సమాచారం. మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించిన బాబుపై హైకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఏపీ సీఐడీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.