iDreamPost
android-app
ios-app

AP ప్రజలకు శుభవార్త.. ఇవాళ వారందరి ఖాతాల్లో డబ్బులు జమ! హైకోర్టు కీలక ఆదేశాలు

  • Published May 10, 2024 | 9:27 AM Updated Updated May 10, 2024 | 11:44 AM

Good News for AP People: ఏపీలో ఎన్నికల సందడి కొనసాగుతుంది.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ పడింది.

Good News for AP People: ఏపీలో ఎన్నికల సందడి కొనసాగుతుంది.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సంక్షేమ పథకాల అమలుకు బ్రేక్ పడింది.

AP ప్రజలకు శుభవార్త.. ఇవాళ వారందరి ఖాతాల్లో డబ్బులు జమ! హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాల్లో మునిగిపోయారు. గెలుపు పై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోఫికేషన్ జారీ అయిన వెంటనే ఏపీలో కోడ్ ఉల్లంఘన అమల్లోకి వచ్చింది. దీంతో వివిధ పథకాల అమలుకు బ్రేక్ పడింది. తాజాగా ఏపీ ప్రజలకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ నేడు సంక్షేమ పథకాల నిధులు జమకానున్నాయి. అయితే ఈ నిధులు శుక్రవారం ఒక్కరోజు మాత్రమే ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రజలకు గొప్ప శుభవార్త. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నేడు (శుక్రవారం 10) సంక్షేమ పథకాల నిధులు జమ కానున్నాయి. ఆసరా, ఈ బీసీ నేస్తం, విద్యా దీవెన, ఇన్ఫూట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయకూడదని ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆదేశాలపై హై కోర్టు స్టే విధించింది. ఈ ఒక్క రోజు నిధులు విడుదలకు వెసులు బాటు కల్పించింది ఏపీ హైకోర్టు. ఇందుకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద రూ.5060.49 కోట్లు, ఆసర పథకం కింద 6394 కోట్లు, వైయస్సార్ కళ్యాణమస్తు కు రూ.78.53. కోట్లు, జగనన్న విద్య దీవెనకు రూ. 708.68 కోట్లు, రైతు ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1294.59 కోట్లు, వైయస్ఆర్ ఈబీసీ రూ.629.37. కోట్లు పంపిణీ చేయనున్నారు.

ఈ నెల 11 నుంచి 13 వరకు పథకాల నిధులను లబ్దిదారుల అకౌంట్ లలో జమ చేయవొద్దని ఆదేశించింది. అంతే కాదు పోలింగ్ తర్వాత పథకాల నిధుల్ని విడుదల చేయాలన్న ఈసీ ఉత్తర్వుల అమలును ఈ నెల 10 వరకు తాత్కాలికంగా పక్కన పెట్టడంతో లబ్దిదారులు సంతోషం ప్రకటించారు. ఇక నిధుల విడుదల విషయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించరాదని. నిధుల పంపిణీ విషయాన్ని ప్రచారం చేయవొద్దని స్పష్టం చేసిన న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి, ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. నిధుల పంపిణీ సమయంలో  రాజకీయ నేతల ప్రమేయం ఉండకూడదని, సంబంరాలు ఎలాంటి ఆర్భాలు, ప్రచారాలు లాంటివి  చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచాచణ జూన్ 27 కు వాయిదా వేసింది.