iDreamPost
android-app
ios-app

ఇది కదా జగన్ విజన్… ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అంబేద్కర్ ఆశయాలను నిరవేరుస్తున్నారు. అలానే ఇంకా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. తన మంత్రి వర్గంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించారు. ఇలా పరిపాలనలో జగన్ విజన్ కి ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే.

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అంబేద్కర్ ఆశయాలను నిరవేరుస్తున్నారు. అలానే ఇంకా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. తన మంత్రి వర్గంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించారు. ఇలా పరిపాలనలో జగన్ విజన్ కి ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే.

ఇది కదా జగన్ విజన్… ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ 56 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి..ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధే తన ధ్యేయంగా పెట్టుకుని సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారు. అంతేకాక సామాజిక సాధికారత పెద్ద పీట వేశారు. అందుకు నిదర్శనమే తన మంత్రి మండలిలో అన్ని వర్గాల నేతలకు స్థానం కల్పించారు. తాజాగా ఓ ఇంటర్యూల్లో అన్నివర్గాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విజన్ గురించి వారు ఎంతో చక్కగా వివరించారు. వారు చెప్పిన విషయాలను చూస్తే..జగన్ విజన్ కి ఎవరైన సెల్యూట్ కొట్టాల్సిందే.

తాజాగా ఓ జర్నలిస్ట్ నిర్వహించిన డిబెట్ కి ఏపీ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, రాజన్నదొర, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, కారుమూరి నాగేశ్వరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలన గురించి, ఆ విజన్ గురించి వివరించారు. అలానే అన్ని కులాలకు, మతాలకు ఏ విధంగా ప్రాధాన్యత కల్పిస్తున్నారు మంత్రులు వివరించారు.

cm jagan

ఇక డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ.. తమ సామాజిక వర్గనికి వైసీపీ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసిందని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ.23,415 కోట్లను ఖర్చు చేసిందని తెలిపారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వ  కేవలం రూ.2665కోట్లను ఖర్చు చేశారు చేసిందని తెలిపారు. అంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా మైనార్టీల కోసం  ఖర్చు చేశాం. దీని బట్టే సీఎం జగన్ మైనార్టీలకు ఎంతటి ప్రాధానత్య ఇస్తున్నారో అర్థమవుతుందని ఆయన తెలిపారు..

ఇక సురేష్ మాట్లాడుతూ.. అధికారం ఉంటేనే సేవ చేస్తాం, లేకుంటే చేయలేమనేది సరైన భావన కాదని, మనం ప్రజల పక్షాన ముఖ్యమన్నారు. అంతేకాక తమకు పవర్ ఇచ్చింది నియోజవర్గ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలని సీఎం జగన్ తెలిపినట్లు సురేష్ పేర్కొన్నారు. ఇక ఇతర మంత్రులు మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశాయలను నిరవేర్చడం మన కర్తవ్యమని సీఎం జగన్ సూచించినట్లు మంత్రులు తెలిపారు. అలానే ఒకప్పుడు పేదలు ఆస్పత్రికి వెళ్తే చికిత్స అయ్యే ఖర్చులను చూసి భయపడే వారని, నేడు అలాంటి  పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. రోగులు చికిత్స తీసుకుని అనంతరం ఇంటికి వెళ్లే వరకు అయ్యే ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తుందని,  ఇది పేదలకు ఎంతో వరమని మంత్రులు తెలిపారు. ఇక పేద, బడుగు, బలహీన వర్గాల వారికి నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ మీడియాన్ని, విదేశాల్లో విద్యాను సాగించే అవకాశాన్ని కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కల్పించారని, ఇదే సామాజిక సాధికారత అని మంత్రులు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ.. దేశంలో పేద,బడుగు బలహీన వర్గాల వారిని విదేశాల్లో చదివించిన ఘనత సీఎం జగన్ ది. అంతేకాక పేద పిల్లల చదువుకోనే ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చారని, ఇప్పుడు తమ గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకా… గతంలో ఉన్నది మొత్తం ప్రక్షాళన చేయడం జరిగిందని, ముఖ్యంగా అమ్మఒడి అంటూ ఓ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చని నమ్మిన అంబేద్కర్ ఆశయాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి. మంత్రి వేణు గోపాల్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేస్తుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని  ఆయన తెలిపారు. మొత్తంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ సీఎం జగన్ అద్భుత పరిపాలన అందిస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. మరి.. మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.