iDreamPost
android-app
ios-app

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె ఆపరేషన్ పూర్తి..

ఇటీవల ఏపీ రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వెంటనే విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. గుండె సంబంధిత సమస్యలను వైద్యులు గుర్తించారు.

ఇటీవల ఏపీ రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వెంటనే విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. గుండె సంబంధిత సమస్యలను వైద్యులు గుర్తించారు.

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు గుండె ఆపరేషన్ పూర్తి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స జరిగింది. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో సతమతమవుతున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఆయన జ్వరంతో బాధపడ్డారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె సంబంధిత సమస్యగా వైద్యులు నిర్ధారించారు. ముఖ్యంగా ఆయన గుండె నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆసమయంలో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయితే స్టంట్ వెయ్యాలా? ఆపరేషన్ చేయాలా? అన్నది నిర్ధారిస్తామని చెప్పారు. కానీ మంత్రి అత్యవసర పనులు కారణంగా ఆసుపత్రిలో చేరలేదు.

వైఎస్సాఆర్ సీపీ చేపట్టిన బస్సు యాత్ర ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేరు వేరుగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ బస్సు యాత్రను ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ వంటి నేతల ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతోంది. ఈనేపథ్యంలోనే ఇటీవల శృంగవరపు కోట లో వైసీపీ సామాజిక సాధికర బస్సు యాత్ర జరిగింది. ఆ సమయంలోనే  మంత్రి బొత్స అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

గతవారం రోజులుగా గుండె సంబంధిత సమస్యతో మంత్రి బొత్స ఇబ్బంది పడ్డారని సమాచారం. ఈ నేపథ్యంలోనే విశాఖ లో వైద్య పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం మంత్రి బొత్స హైదరాబాద్ కి వెళ్లారు. శనివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో గుండె ఆపరేషన్ జరిగింది. నెల రోజులు వరకు హైదరాబాద్ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించారని సమాచారం.

బొత్స సత్యనారాయణ విషయానికొస్తే.. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖమైన రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. ఉమ్మడి ఏపీకి పీసీసీ అధ్యక్షుడిగా కూడా బొత్స పని చేశారు. 2004లో డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పని చేశారు. అనంతరం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి  మంత్రి వర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైఎస్సాఆర్ సీపీ లో చేరారు. 2019 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మోహన్ రెడ్డి కేబినేట్‌లో మున్సిపల్ మరియు పట్టాణాభివృద్ది మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు.