Arjun Suravaram
ఆధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల విషయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలకు శాసన మండలి ఛైర్మన్ గట్టి షాకిచ్చారు. ఇటీవలే శాసన సభ స్పీకర్ కూడా ఎనిమిది మందిపై సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఆధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుల విషయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలకు శాసన మండలి ఛైర్మన్ గట్టి షాకిచ్చారు. ఇటీవలే శాసన సభ స్పీకర్ కూడా ఎనిమిది మందిపై సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Arjun Suravaram
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల విషయంలో అసెంబ్లీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని అసెంబ్లీ స్పీకర్ రద్దు చేశారు. అలానే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను ఆమోదించారు. ఇలా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఏపీ అసెంబ్లీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఫిరాయింపు ఎమ్మెల్సీలకు భారీ షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు శాసనమండలి సభ్యులపై భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై వేటుపడింది. పార్టీ ఫిరాయించిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీల పదవిని రద్దు చేస్తూ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. వంశీ కృష్ణయాదవ్, సి రామచంద్రయ్య వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఇంతకాలం వైసీపీ తరపున శాసన మండలిలో ఎమ్యేల్సీలు గా ఉన్న వీరిద్దరు ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వంశీకృష్ణ జనసేనలోకి చేరగా, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరుగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు మండలి కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మన్ స్పందించారు.
ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. దీంతో ఇలా ఒక పార్టీలో పదవి పొంది వేరే పార్టీలోకి వెళ్లిన సభ్యులకు గట్టి షాక్ తగినట్లు అయింది. మరి.. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.