AP Govt-Temple Priests Minimum Salary: APలో వారికి శుభవార్త.. నెలకు ఒక్కొక్కరికి రూ. 15 వేలకు పైనే

APలో వారికి శుభవార్త.. నెలకు ఒక్కొక్కరికి రూ. 15 వేలకు పైనే

సంక్షేమ ప్రభుత్వం, ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ తాజాగా మరో శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ఆ వివరాలు..

సంక్షేమ ప్రభుత్వం, ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ తాజాగా మరో శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ఆ వివరాలు..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమ కోసం కృషి చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల వారికోసం అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకువచ్చి.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తూ.. అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. నిన్ననే జగనన్న చేదోడు 4వ విడత నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్‌. ఇక తాజాగా విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికల సందర్భంగా అర్చకులకు ఇచ్చిన హామీని తాజాగా నెరవేర్చారు సీఎం జగన్‌. దీనివల్ల.. రాష్ట్రంలోని 26 జిల్లాలోని 1,177 మంది అర్చకులకు లబ్ధి కలనగనుంది. అర్చకులకు ప్రతి నెల 15 వేల రూపాయలకు పైగా అందనున్నాయి. ఆ వివరాలు..

రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు ప్రతి నెల వేతనంగా రూ.15,625లు అమలు చేస్తూ దేవాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 14-05-2021న జీవో నంబర్ 52 జారీ చేయగా.. అందుకు అనుగుణంగా గురువారం నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల.. ఆంధ్ర ప్రదేశ్ అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల.. శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ఇక శుక్రవారం రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు.

Show comments