AP విద్యార్థులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఆ స్కూళ్లల్లో ఉచితం..!

AP Government: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక పథకాలను ప్రవేశ పెట్టి..పేద విద్యార్థుల ఉన్నతకి జగన్ సర్కార్ కృషి చేస్తుంది. ఇప్పటికే విద్యార్థులకు అనే అంశాల్లో శుభవార్త చెప్పిన.. ఏపీ ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది.

AP Government: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికి చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక పథకాలను ప్రవేశ పెట్టి..పేద విద్యార్థుల ఉన్నతకి జగన్ సర్కార్ కృషి చేస్తుంది. ఇప్పటికే విద్యార్థులకు అనే అంశాల్లో శుభవార్త చెప్పిన.. ఏపీ ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగంలో తనదైన మార్క్ ను చూపించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. ఆయన ప్రవేశ పెట్టిన అమ్మఒడి, నాడు-నేడు వంటి ఇతర పథకాల ద్వారా విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన, ఆహ్లదకరమైన విద్య అందుతోంది. అలానే ప్రైవేట్ పాఠశాలల విషయంలోనే జగన్ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు  సీట్ల కేటాయించింది. తాజాగా మరోసారి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు  చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. అంతేకాక  ప్రైవేటు పాఠశాలకు ధీటుగా సర్కార్ బడులను అభివృద్ధి చేసింది. ఇలా ప్రభుత్వ పాఠశాలల విషయంలో అనేక మార్పులు చేసిన ఏపీ సర్కార్ ప్రైవేటు పాఠశాలల విషయంలోనూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.  అలానే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు స్కూల్స్ లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. అయితే తాజాగా ఇదే అంశంపై పేద విద్యార్థులకు సీఎం జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేటు స్కూల్స్ లో పేద విద్యార్థులకు సీట్ల కేటాయింపుపై ఏపీ గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి కూడా దీనిని అమలుజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 2023-24 విద్యా సంవత్సరం వరకూ ఈ విధానం అమలుచేసేలా ఆదేశాలు ఇచ్చింది. తాజాగా 2024-25 విద్యా సంవత్సరానికి కూడా పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

ఇక మరోవైపు దేశంలోని అన్ని ప్రైవేటు, ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో 25శాతం సీట్లను పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఉచిత నిర్బంధ విద్య చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్య ఒక హక్కుగా కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు పేద విద్యార్థులకు కేటాయించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్, స్పెషల్ కేటగిరీ స్కూల్స్ లో కనీసం 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో కల్పించే ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అనాథ పిల్లలకు మొదట ప్రాధాన్యం ఇస్తారు.

ఇక కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పలు రాష్ట్రాలు 25 శాతం సీట్లను అమలు అయ్యేలా చూస్తున్నాయి. అలానే ఏపీ ప్రభుత్వం కూడా 2023-24 అకాడమిక్ ఇయర్ లో ఈ విధానం కింద పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్ లో ప్రవేశాలు కల్పించింది.  అలానే తాజాగా వచ్చే ఏడాది కూడా పొగడిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వూలు జారీ చేసింది.  అయితే ఈ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు పొందాలనుకునే విద్యార్థులు ప్రభుత్వం వెల్లడించిన తేదీలలో తొలుత ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత రిజిస్ట్రేషన్ లో వచ్చిన అప్లికేషన్లను లాటరీ తీస్తారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ప్రవేటు పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments